రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా ఐదుగురికి గాయాలు
- March 31, 2017
గురువారం షేక్ ఇసా బిన్ సల్మాన్ జాతీయ రహదారిపై జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో 65 ఏళ్ల బహ్రేయినీ వృద్ధురాలు మరణించింది. మరో ఐదుగురు వ్యక్తులు ఆ ప్రమాదంలో గాయపడ్డారు.నివేదికల ప్రకారం, ఒక ఆసియా వ్యక్తి నడుపబడుతున్న సౌదీ నుంచి ప్రయాణిస్తున్న ఒక ట్రక్ అకస్మాత్హుగా రోడ్డుపై నియంత్రణ కోల్పోయింది. ఎంతో రద్దీగా ఉండే అల్ జాంబియా వంతెనపై ఉన్నప్పుడు ఇతర వాహనాలపైకి దూసుకుపోయింది అధికమైన వేగం మరియు డ్రైవింగ్ పై సరిగా దృష్టిని నిలపకపోవడం వలన ఈ ప్రమాదానికి ముఖ్య కారణమని నివేదికల పేర్కొంటున్నాయి. ఒక ఎస్ యు వి వాహనంలో ముగ్గురు బహ్రయినీయులు ప్రయాణిస్తున్నారు.ఇంతలో అకస్మాత్తుగా వెనుక నుంచి ట్రక్ వీరి వాహనంలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఎస్ యు వి వాహనంలో వెనుక కూర్చొన్న వృద్ధురాలు అక్కడక్కడే మరణించిందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇదే ట్రక్కు ఐదుగురు ఆసియా ప్రయాణికుల సమూహంని తీసుకుని వెళుతున్నమరో పికప్ వ్యాన్ ను డీ కొట్టింది .అందులో ప్రయాణిస్తున్నవారు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సలమియా మెడికల్ కాంప్లెక్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. రెస్క్యూ జట్లు వెంటనే ప్రమాద స్ధలానికి వచ్చారు. తొలగింపు కార్యకలాపాలు చేపట్టారు ట్రక్ సహా వాహనాలు క్రేన్లు సహాయంతో ప్రమాద స్థలం నుండి తొలగించారు.ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ ఈ ప్రమాద కారణం నిర్ధారించడానికి పరిశోధనలు ప్రారంభించారు.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







