రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా ఐదుగురికి గాయాలు

- March 31, 2017 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా ఐదుగురికి గాయాలు

గురువారం షేక్ ఇసా బిన్ సల్మాన్ జాతీయ రహదారిపై జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో 65 ఏళ్ల బహ్రేయినీ వృద్ధురాలు మరణించింది. మరో ఐదుగురు వ్యక్తులు ఆ ప్రమాదంలో గాయపడ్డారు.నివేదికల ప్రకారం, ఒక ఆసియా వ్యక్తి నడుపబడుతున్న సౌదీ నుంచి ప్రయాణిస్తున్న ఒక ట్రక్ అకస్మాత్హుగా రోడ్డుపై నియంత్రణ కోల్పోయింది. ఎంతో రద్దీగా ఉండే అల్ జాంబియా వంతెనపై ఉన్నప్పుడు ఇతర వాహనాలపైకి దూసుకుపోయింది అధికమైన వేగం మరియు డ్రైవింగ్ పై సరిగా దృష్టిని నిలపకపోవడం వలన ఈ ప్రమాదానికి ముఖ్య కారణమని నివేదికల పేర్కొంటున్నాయి. ఒక ఎస్ యు వి వాహనంలో ముగ్గురు బహ్రయినీయులు ప్రయాణిస్తున్నారు.ఇంతలో అకస్మాత్తుగా వెనుక నుంచి ట్రక్ వీరి వాహనంలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఎస్ యు వి వాహనంలో వెనుక కూర్చొన్న వృద్ధురాలు అక్కడక్కడే మరణించిందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇదే ట్రక్కు ఐదుగురు ఆసియా ప్రయాణికుల సమూహంని తీసుకుని వెళుతున్నమరో పికప్ వ్యాన్ ను డీ కొట్టింది .అందులో ప్రయాణిస్తున్నవారు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సలమియా మెడికల్ కాంప్లెక్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. రెస్క్యూ జట్లు వెంటనే ప్రమాద స్ధలానికి వచ్చారు. తొలగింపు కార్యకలాపాలు చేపట్టారు  ట్రక్ సహా వాహనాలు క్రేన్లు సహాయంతో ప్రమాద స్థలం నుండి తొలగించారు.ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ ఈ ప్రమాద కారణం నిర్ధారించడానికి పరిశోధనలు ప్రారంభించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com