విడుదలైన 'గోప్యం' పాటలు

- March 31, 2017 , by Maagulf
విడుదలైన 'గోప్యం' పాటలు

నూతన నటీనటులు తరుణ్‌, ఇందు, నవీన్‌, అనూష, వంశీ, నజియా ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘గోప్యం’. తరుణ్‌ క్రియేషన్స్‌ పతాకంపై రఘు నిర్మిస్తున్న ఈ చిత్రానికి బల్లెం వేణుమాధవ్‌ దర్శకత్వం వహించారు. ఆత్రేయ స్వరాలు సమకూర్చారు. శుక్రవారం హైదరాబాద్‌లో పాటల విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రామచంద్రరావు, నటుడు రాజేంద్రప్రసాద్‌, రచయిత గోపాలకృష్ణ హాజరై తొలిసీడీని ఆవిష్కరించారు. హత్య నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలోనే విడుదల చేస్తామని చిత్రబృందం తెలిపింది. .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com