సగం మనిషి.. సగం మృగం గా రానున్న నమిత
- March 31, 2017
తెలుగు ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ నటించిన 'జెమిని' చిత్రంలో హాట్ హాట్ గా కనిపిస్తూ..కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన భామ నమిత తర్వాత వచ్చిన సొంతం,ఒక రాధ ఇద్దరు కృష్ణులు చిత్రాల్లో చాలా స్లిమ్ గా అందంగా కనిపించింది. తర్వాత ఈ బ్యూటీ తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కొంత కాలం తర్వాత నమిత అస్సలు గుర్తుపట్టనంతగా మారిపోయింది..లావుగా తయారైంది. 1998లో మిస్ సూరత్ గా మరియు 2001లో మిస్ ఇండియా పోటీల్లో నాలుగవ స్థానం సంపాదించింది. అలాంటి నమిత బొద్దుగా తయారు కావడంతో సినిమా చాన్సులు తగ్గుతూ వచ్చాయి. ఆ మద్య బాలకృష్ణతో 'సింహ' లో 'సింహమల్లే వచ్చాడే' అనే పాటలో చాలా అందంగా కనిపించింది.
తెలుగు, తమిళ,కన్నడ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించిన నమిత తాజాగా మరో సినిమాతో అభిమానుల ముందుకు రాబోతుంది. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని ట్రెండ్ ని ఫాలో అవుతూ న్యూ మూవీ చేస్తోంది. ' పొట్టు ' పేరుతో తమిళ్ లో తెరకెక్కుతున్న మూవీలో నమిత సగం మనిషి.. సగం మృగం కలగలిసిన ఓ వింత క్యారెక్టర్ చేస్తోంది.
హారర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో తాను చేస్తున్న క్యారెక్టర్ తన కెరీర్లో ఇప్పటి వరకూ ట్రై చేయలేదని చెబుతోంది. గతంలో గ్లామర్ పాత్రలు పోషించిన నమిత ఈ సారి ఓ మృగంగా కనిపంచడం పై అందరికీ ఆసక్తి రేకెత్తుతుంది. ఈ మూవీతో తనకి మళ్ళీ బ్రేక్ రావడం ఖాయం అని కాంఫిడెంట్ గా వుంది. తమిళ్ తో పాటూ తెలుగులో కూడా రిలీజ్ కాబోయే ఈ మూవీతో మళ్ళీ తెలుగులో బిజీ అవుతానంటోంది నమిత.
తాజా వార్తలు
- RBI: ప్రభుత్వ ఖాతాలోకి లక్షల కోట్లు..సామాన్యులకు పన్ను ఊరట?
- ప్రమాదానికి గురైన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానం
- స్పెషలిస్ట్ లేకుండా లేజర్ సెషన్లు..!!
- ముత్రాలో పడవ బోల్తా..మృతులు లైఫ్ జాకెట్లు ధరించలేదు..!!
- ఉత్తర ముహారక్ ఆరోగ్య కేంద్రంలో 24 గంటల సేవలు పునరుద్ధరణ..!!
- సౌదీలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సవాళ్లపై చర్చలు..!!
- కువైట్ లో ట్రాఫిక్ జరిమానాల పేరిట స్కామ్ మెసేజులు..!!
- దుబాయ్ లో ప్రపంచంలోనే మొట్టమొదటి గోల్డ్ స్ట్రీట్..!!
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి







