హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన వివేక్
- March 31, 2017
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) నూతన అధ్యక్షుడిగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వివేక్ ఎన్నికయ్యారు. పాలకవర్గం కోసం జనవరి 17న ఎన్నికలు నిర్వహించారు. దీనిపై కొంతమంది కోర్టుకు వెళ్లడంతో అనిశ్చితి నెలకొంది. తాజాగా ఎన్నికల ఫలితాలను ప్రకటించాలని ఉమ్మడి హైకోర్టు గురువారం తీర్పు వెలువరించిన నేపథ్యంలో శుక్రవారం ఓట్లను లెక్కించారు. అధ్యక్ష పదవికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేకానంద్, మాజీ ఆటగాడు విద్యుత్ జయసింహ పోటీపడ్డారు. అయితే విద్యుత్ జయసింహపై 68 ఓట్ల తేడాతో వివేక్ గెలుపొందారు. మొత్తం ఓట్లలో వివేక్‌కు 136, జయసింహకు 68 ఓట్లు దక్కాయి. అన్ని స్థానాల్లోనూ వివేక్ ప్యానెల్ గెలుపొందింది. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. హెచ్‌సీఏకు పూర్వవైభవం తీసుకొస్తానని మాటిచ్చారు. లోధా కమిటి సిఫార్సుల మేరకే ఎన్నికలు జరిగినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







