ఘనంగా నడిగర్ సంఘం నూతన భావన శంకుస్థాపన
- March 31, 2017
దక్షిణ భారత నటీనటుల (నడిగర్) సంఘం నూతన భవనానికి శుక్రవారం శంకుస్థాపన జరిగింది. స్థానిక టి.నగర్ హబీబుల్లా రోడ్డులో ఉన్న నడిగర్ సంఘం స్థలంలో సంఘం అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్, ఉపాధ్యక్షుడు పొన్వణ్ణన్ నేతృత్వంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ సంప్రదాయబద్ధంగా భూమి పూజ నిర్వహించారు. 2015లో జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల సందర్భంగా విశాల్ జట్టు గెలిస్తే కొత్త భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కట్టడం నిర్మాణానికి చట్టపరమైన చిక్కులను తొలగించేందుకు, నిధుల సమీకరణకు ఏడాదిపాటు సమయం పట్టింది.
ప్రస్తుతం 19 గ్రౌండ్ల నడిగర్ సంఘం స్థలంలో రూ.26 కోట్ల వ్యయంతో నాలుగు అంతస్థులతో భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో వెయ్యిమంది సామర్ధ్యంతో ఆడిటోరియం, ప్రివ్యూ థియేటర్, జిమ్, నాట్య ప్రదర్శనాలయం, ఎడిటింగ్, డబ్బింగ్, కంపోజింగ్ స్టూడియోలు, నడిగర్ సంఘం కార్యాలయం వంటి సదుపాయాలు ఉంటాయి. ఈ భవన నిర్మాణం కోసం విశాల్, కార్తీ రూ.10 కోట్లు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి రజనీకాంత్, కమల్హాసన్లతో పాటు పలువురు సీనియర్ నటీనటులు హాజరయ్యారు.

తాజా వార్తలు
- రౌదత్ అల్ ఘెజ్లానియా స్ట్రీట్ 15 రోజుల పాటు మూసివేత..!!
- అమెరికాకు షాకిచ్చిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో మొట్టమొదటి బయోమెట్రిక్ పేమెంట్స్ ప్రారంభం..!!
- జ్లీబ్ అల్-షుయూఖ్లో 10 భవనాలు కూల్చివేత.. నోటీసులు..!!
- హిట్-అండ్-రన్ ప్రమాదం..చిన్నారి మృతి, డ్రైవర్ అరెస్ట్..!!
- ప్రయాణికుడి డబ్బు దుర్వినియోగం..ఇద్దరికి శిక్ష..!!
- వీసాల పై టెక్సాస్ కీలక నిర్ణయం..అదే బాటలో ఫ్లోరిడా!
- చేతి వాచ్ ఆధారంగా అజిత్ పవార్ మృతదేహం గుర్తింపు
- నేటి నుంచి కొత్త ఆధార్ యాప్ ఫుల్ వెర్షన్ అందుబాటులోకి..ప్రధాన ఫీచర్లు ఇవే..
- RBI: ప్రభుత్వ ఖాతాలోకి లక్షల కోట్లు..సామాన్యులకు పన్ను ఊరట?







