బి ఎస్ ఎన్‌ఎల్‌ సరికొత్త ప్లాన్‌ 10 జిబి డేటా రోజుకు

- March 31, 2017 , by Maagulf
బి ఎస్ ఎన్‌ఎల్‌ సరికొత్త  ప్లాన్‌ 10 జిబి డేటా రోజుకు

బి ఎస్ ఎన్‌ఎల్‌ సరికొత్త బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌
 ప్రభుత్వ రంగ టెలికాం బిఎ్‌సఎన్‌ఎల్‌.. వినియోగదారులను మరింత ఆకట్టుకునేందుకు అపరిమిత బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ను తీసుకువచ్చింది. 2 ఎంబిపిఎస్‌ స్పీడ్‌, ఉచిత ఇన్‌స్టలేషన్‌తో ఎక్స్‌పీరియన్స్‌ అన్‌లిమిటెడ్‌ బిబి249 పేరుతో ఈ ఆఫర్‌ను తీసుకువచ్చింది. ప్లాన్‌లో భాగంగా నెలకు 249 రూపాయలు చెల్లించటం ద్వారా రోజుకు 10 జిబి డేటాను వినియోగదారులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని బిఎ్‌సఎన్‌ఎల్‌ తెలిపింది. డేటా డౌన్‌లోడ్‌కు అదనంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఏ నెట్‌వర్క్‌కు అయిన అపరిమిత కాల్స్‌ చేసుకోవచ్చని పేర్కొంది.
దేశంలో వైర్‌లైన్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసుల కింద రోజుకు 10 జిబి డేటాను అందిస్తున్నది బిఎ్‌సఎన్‌ఎల్‌ ఒక్కటేనని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com