సానియా జోడీ మియామి ఓపెన్ ఫైనల్లో
- March 31, 2017
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మియామి ఓపెన్ ఫైనల్లో ప్రవేశించింది. మహిళల డబుల్స్ విభాగంలో సానియా-స్ట్రికోవా జోడీ 6(6)-7(8), 6-1, 10-4తో మార్టినా హింగిస్-చాన్ జంటను ఓడించింది.
హోరాహోరీగా సాగిన తొలి సెట్‌ను హింగీస్ జోడీ కైవసం చేసుకుంది. తర్వాత పుంజుకున్న సానియా జోడీ ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. వెంట వెంటనే పాయింట్లు సాధించి 6-1తో రెండో సెట్‌ను సునాయాసంగా గెలుచుకుంది. నిర్ణయాత్మక మూడో సెట్ నువ్వా నేనా అన్నట్లు సాగింది. చివరికి 10-4తో సానియా జోడి సెట్‌ను గెలుచుకుని ఫైనల్‌కు దూసుకెళ్లింది. సానియా జోడీ ఫైనల్లో గాబ్రియల్(కెనడా)-వై.చు(చైనా)తో తలపడనుంది.
తాజా వార్తలు
- వింగ్స్ ఇండియా 2026 సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక సమావేశాలు
- ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్
- ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం
- అరబ్-భారత సహకార వేదిక ఉజ్వల భవిష్యత్తుకు వారధి..!!
- ఖతార్, భారత్ మధ్య పెట్టుబడి అవకాశాలపై చర్చలు..!!
- షార్జాలో సినిమా ఫక్కీలో కారు చోరీ.. దొంగ అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో ఫాగ్, రెయిన్స్ హెచ్చరికలు జారీ..!!
- అంతరిక్ష రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఒమన్ పిలుపు..!!
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..







