సానియా జోడీ మియామి ఓపెన్‌ ఫైనల్లో

- March 31, 2017 , by Maagulf
సానియా జోడీ మియామి ఓపెన్‌ ఫైనల్లో

భారత టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా మియామి ఓపెన్‌ ఫైనల్లో ప్రవేశించింది. మహిళల డబుల్స్‌ విభాగంలో సానియా-స్ట్రికోవా జోడీ 6(6)-7(8), 6-1, 10-4తో మార్టినా హింగిస్‌-చాన్‌ జంటను ఓడించింది.
హోరాహోరీగా సాగిన తొలి సెట్‌ను హింగీస్‌ జోడీ కైవసం చేసుకుంది. తర్వాత పుంజుకున్న సానియా జోడీ ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. వెంట వెంటనే పాయింట్లు సాధించి 6-1తో రెండో సెట్‌ను సునాయాసంగా గెలుచుకుంది. నిర్ణయాత్మక మూడో సెట్‌ నువ్వా నేనా అన్నట్లు సాగింది. చివరికి 10-4తో సానియా జోడి సెట్‌ను గెలుచుకుని ఫైనల్‌కు దూసుకెళ్లింది. సానియా జోడీ ఫైనల్లో గాబ్రియల్‌(కెనడా)-వై.చు(చైనా)తో తలపడనుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com