షార్జా పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్ 162 మంది కార్మికులకు అస్వస్థత
- April 01, 2017
శుక్రవారం ఉదయం షార్జాలో కార్మికుల 'వసతి వద్ద మరొక గ్యాస్ లీక్ పలువుర్ని ఆందోళనకు గురిచేసింది. షార్జా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఇండస్ట్రియల్ ఏరియా 4 లో ఒక ప్రధాన గ్యాస్ లీకైన దుర్ఘటన ఆందోళనను సృష్టించింది.ఎగుమతి చేపట్టే ఒక సంస్థ యొక్క గిడ్డంగి నుంచి ఒక పెద్ద పేలుడు సంభవించింది. దాంతో ఆ ప్రాంతంలో క్లోరిన్ వాయువు వెలువడటంతో ఆ పరిసరాలలో భయం వ్యాపించింది. శుక్రవారం ఇండస్ట్రియల్ ఏరియా 10 లో కార్మికుల 'వసతి గ్యాస్ లీక్ కారణంగా ఊపిరాడక 162 మంది కార్మికులు ఇబ్బందులు అనుభవించారు. ఇండస్ట్రియల్ ఏరియా 10 లో సంఘటన గురించి శుక్రవారం ఉదయాన్నే పోలీసులు ఒక అత్యవసర కాల్ అందుకొన్నారు వెనువెంటనే ప్రమాద స్ధలానికి ఒక రెస్క్యూ యూనిట్ పంపింది. పౌర రక్షణ జట్టు కూడా ఎటువంటి అవాంఛనీయ అగ్నిప్రమాదాలు నిరోధించడానికి అక్కడకు చేరుకొన్నారు. షార్జా మున్సిపాలిటీ అధికారిక సమాచారం ప్రకారం కార్మికులు నివాస వసతిని సరైనగాలి వెలుతురు వచ్చే అవకాశం లేకపోవడంతో గ్యాస్ లీక్ వలన ఈ ఉపద్రవం జరిగిందని పేర్కొన్నారు. మారె ఇతర ఏ ప్రధాన కాలుష్యం కారణం కాదు. షార్జా ఇండస్ట్రియల్ ఏరియా 10 లో చేసిన వారిలో సబీర్ ఆలీ మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ లో మేనేజర్ మహమ్మద్ షాబాజ్ మాట్లాడుతూ గ్యాస్ ప్రభావిత కార్మికులు శ్వాస సమస్యలు కలగడం మినహా మారె ఏ ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తలేదని చెప్పారు.
తాజా వార్తలు
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!
- ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!
- కువైట్‌లో 1.059 మిలియన్లకు పెరిగిన భారతీయ జనాభా..!!
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ గ్రాండ్ రిసెప్షన్ సక్సెస్..!!
- సిత్రాలో ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి సిఫార్సు..!!







