రజనీకాంత్‌ అల్లుడు సినిమా సెట్‌లో

- April 01, 2017 , by Maagulf
రజనీకాంత్‌  అల్లుడు సినిమా సెట్‌లో

తన అల్లుడు, హీరో ధనుష్‌ సినిమా సెట్‌కు అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ వెళ్లి సందడి చేశారు. రజనీ కుమార్తె సౌందర్య దర్శకత్వంలో ధనుష్‌ హీరోగా ‘వీఐపీ-2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రజనీ సినిమా సెట్‌కు వచ్చిన ఫొటోలను సౌందర్య అభిమానులతో పంచుకున్నారు. ‘దీని కన్నా గొప్పదాన్ని పొందలేను. సెట్‌లో వన్‌ అండ్‌ ఓన్లీ సూపర్‌స్టార్‌ మా నాన్న. ధనుష్‌కు చివరిరోజు షూటింగ్‌’ అని ట్వీట్‌ చేశారు.
‘రఘువరన్‌ బీటెక్‌’కు సీక్వెల్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రానికి కలైపులి ఎస్‌. థాను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమలాపాల్‌ కథానాయికగా నటిస్తుండగా బాలీవుడ్‌ నటి కాజోల్‌ ముఖ్య భూమిక పోషిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com