బహ్రెయిన్ లో జీసీసీ నివాసితులు ఐడి కార్డులు పొందాలి

- April 02, 2017 , by Maagulf
బహ్రెయిన్ లో  జీసీసీ నివాసితులు ఐడి కార్డులు పొందాలి

మనామా:త్వరలో కింగ్డమ్ లో వివిధ ప్రభుత్వ విభాగాలలో అవాంతరం కలగకుండా ఉండేందుకు  ఉచిత సేవలను సులభతరం చేసే నిమిత్తం బహ్రేయినీ గుర్తింపు కార్డులు జారీ చేయనున్నట్లు సమాచార మరియు ఈ గవర్నమెంట్ అథారిటీ (ఐ జి ఏ) తెలిపింది. ఈ విధానం ద్వారా బహరేన్ లో ఉన్న  జీసీసీ  నివాసితులు మరియు పెట్టుబడిదారులు ఎక్కువ సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీం కమాండర్ మరియు మొదటి ఉప ప్రధాన మంత్రి రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా సూచించిన నిర్దేశకాలను అనుసరించనున్నారు. ఈ గవర్నమెంట్  అథారిటీ (ఐ జి ఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ మొహమ్మద్ ఆలీ అలఖ్ఎడ్  శనివారం ఈ సమాచారం ప్రకటించారు. ఈ చొరవ ద్వారా దేశంలో వివిధ లావాదేవీలను నిర్వహించడం కోసం  ఒక ఏకీకృత గుర్తింపు రుజువు చేసేందుకు ఈ  గుర్తింపు కార్డు ఉపయోగించడం గురించి రాయల్ డిక్రీ సంఖ్య 2 తో 2013 లో పొందుపర్చారు. ప్రతి జీసీసీ  నివాసి లేదా పెట్టుబడిదారు (దీని రెసిడెన్సీ కింగ్డమ్ లోనికి ప్రవేశించిన  తేదీ నుండి మునుపటి సంవత్సరంలో ఆరు నెలల క్రితం ) మరియు ఒక ప్రామాణిక, అధికారికంగా గుర్తింపు చిరునామా కల్గి ఉండటానికి స్వంత గుర్తింపు కల్గిఉండాలి ఈ గుర్తింపుకార్డు ద్వారా అత్యంత  భద్రత, గోప్యత మరియు సేవలలో నాణ్యత అత్యధిక స్థాయిలో  అందిస్తుందని  ఆలీ అలఖ్ఎడ్ చెప్పారు. ఈ గవర్నమెంట్ విధానంతో  జాతీయ వ్యూహాన్ని అవలంబించడమే కాక  పౌరులు మరియు నివాసితులు ప్రయోజనం  పొందుకొనేలా  ఆన్లైన్ లో లావాదేవీలు అనుకూలంగా ఉంటుంది. ఇది చట్టం సంఖ్య46 యొక్క ఆర్టికల్ 2006 (ఐ డ్  కార్డు సంబంధించి) సమగ్రవిధానం ద్వారా అమలుజరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com