గల్ఫ్ కార్మికుడి అంతిమయాత్రలో ప్లకార్డులతో ప్రదర్శన
- April 02, 2017
గల్ఫ్ దేశాలలోని వలస కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు, వలస కార్మికులు ఆదివారం (02.04.2017) న ఒక గల్ఫ్ కార్మికుడి శవయాత్రలో ప్లకార్డులతో పాల్గొన్న సంఘటన జగిత్యాల జిల్లా మెటుపల్లి మండలం మెట్ల చిట్టాపూర్ లో జరిగింది. తెలంగాణ ఎమిగ్రంట్స్ లేబర్ యూనియన్ (తెలంగాణ ప్రవాసి కార్మిక సంఘం) రాష్ట్ర అధ్యక్షులు కడార్ల రంజిత్ కుమార్, ఉపాధ్యక్షులు బొండల గంగా ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామస్థులు ఈ అంతిమయాత్రలో పాల్గొన్నారు.
మెట్ల చిట్టాపూర్ కు చెందిన నక్క గంగాధర్ (57) తేది: 09.03.2017 సౌదీ అరేబియాలో గుండెపోటుతో చనిపోయారు. మృతుడి కి భార్య లక్ష్మి కూతుళ్లు జల, కవిత ఉన్నారు. గల్ఫ్ లోని మెట్ల చిట్టాపూర్ ఎన్నారై వాట్సాప్ గ్రూప్ సభ్యులు దేవేందర్ ఆధ్వర్యంలో శవాన్ని ఇండియాకు పంపుటకు కృషి చేశారు. ఇదే గ్రామానికి చెందిన రాచర్ల మహేష్ శవపేటిక వెంట సౌదీ నుండి వచ్చారు. 'ప్రవాసి మిత్ర' రాష్ట్ర అధ్యక్షులు మంద భీంరెడ్డి విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ ఏర్ పోర్ట్ నుండి మెట్ల చిట్టాపూర్ వరకు శవపేటిక రవాణాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నారై విభాగం వారు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించారు. కీ.శే. నక్క గంగాధర్ మృతదేహాన్ని ఖననం చేసి అంత్యక్రియలు చేశారు.
గల్ఫ్ ప్రవాసుల డిమాండ్లు:
* విదేశాలలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం రూ.3 లక్షల ఎక్స్ గ్రేషియా (మృత ధన సహాయం) ఇవ్వాలి
* గల్ఫ్ దేశాలలో సంవత్సరానికి 200 మంది తెలంగాణ ప్రవాసీ బిడ్డలు చనిపోతున్నారు, శవపేటికల్లో తెలంగాణకు చేరుతున్నారు. 2 జూన్ 2014 నుండి ఈనాటి వరకు 500 మంది తెలంగాణ ప్రవాసీ బిడ్డల మృతదేహాలు శవపేటికలలో హైదరాబాద్ ఏర్ పోర్ట్ ద్వారా ఇంటికి కు చేరుకున్నాయి.
* 'తెలంగాణ ప్రవాసుల సంక్షేమం' పేరిట టిఆర్ఎస్ ఎన్నికల ప్రణాళిక-2014 లో వలసదారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి.
* టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 33 నెలలు అయింది ! ఇకనైనా పట్టించుకోండి మా ప్రవాసులను !
* గల్ఫ్ ప్రవాసీ కార్మికుల సంక్షేమానికి బడ్జెట్ లో రూ. 100 కోట్లు కేటాయించాలి.
* కేరళ తరహాలో ప్రవాసీల రక్షణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలి.* వలస పోయిన వారి పేర్లను రేషన్ కార్డుల నుంచి తొలగించవద్దు.




తాజా వార్తలు
- ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!
- ఏపీలో కొత్తగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం..
- భారత్ ఘన విజయం
- అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?
- 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
- అజ్మాన్ 'అబ్రా'కు పెరిగిన క్రేజ్
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్‌తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్







