కిలోన్నర మాదకద్రవ్య మాత్రలను పొట్టలో దాచుకొని తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

- April 02, 2017 , by Maagulf
కిలోన్నర మాదకద్రవ్య మాత్రలను పొట్టలో దాచుకొని తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

మస్కట్:' మేడి పండు ...చూడ... మేలిమై ఉండు...పొట్ట విప్పి చూడ పురుగులుండు ' అనే వేమన పద్యం  మస్కట్ లో మరో విధంగా చదువుకోవాలి...బాన బొజ్జలలో అక్రమ మాదకద్రవ్యాలను దాచుకొని తమతో పాటు కదిలే భోషాణాలుగా కొందరు స్మగ్లర్లు మార్చుకొంటున్నారు...మరి ఆవలించకుండానే కడుపులో ఏ రకమైన డ్రగ్గులు ఉన్నాయో చెప్పే ఘటికులైన  గల్ఫ్ పోలీసులు ముంది వారి ఆటలు ఏమాత్రం సాగడం లేదు. ఐనప్పటికీ, వారి యత్నాలు విరమించడం లేదు. ఇటీవల మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక సందర్శకుడు ఉదరంలో156 హెరాయిన్ గుళికలను దాచుకొని ఒమాన్ కు వెళ్లేందుకు ఉపక్రమిస్తున్న సమయంలో రాయల్ ఒమన్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఆసియా దేశానికి చెందిన ఆ స్మగ్లర్ దేశం లోనికి ప్రవేశించే ప్రయత్నంలో డైరెక్టరేట్ నార్కోటిక్స్ కంట్రోల్ రాయల్ ఒమన్ పోలీసులు ఆ నిందితుడు మింగిన గుళికలను  గుర్తించి అదుపులోనికి తీసుకొన్నారు.దాదాపు కిలోన్నర బరువు తూగే 156 హెరాయిన్ గుళికలు ఆ స్మగ్లర్ కడుపులోంచి వెలుపలకు తీశారు.ఈ కేసు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎదుటకు పోలీసులు  సూచింఛారు. ఈ అక్రమ రవాణాపై  మరిన్ని పరిశోధనలు కొనసాగుతున్నాయి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com