ఇండియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ విజేత తెలుగు తేజం

- April 02, 2017 , by Maagulf
ఇండియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ విజేత తెలుగు తేజం

తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు జైత్రయాత్ర కొనసాగుతోంది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచిన సింధు ఇప్పుడు ఇండియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ ఫైనల్‌లో విజేతగా నిలిచింది. టాప్‌ సీడ్‌ స్పెయిన్‌ క్రీడాకారిణి కరోలినా మారిన్‌తో జరిగిన హోరాహోరీ పోరులో రెండు వరుస గేమ్‌ల్లో 21-19, 21-16తో విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో రియో ఒలింపిక్స్‌ ఫైనల్‌లో జరిగిన పరాభవానికి కరోలినాపై సింధు మరోసారి ప్రతీకారం తీర్చుకున్నట్లయ్యింది. రియో ఒలింపిక్స్‌ అనంతరం డిసెంబర్‌ 2016లో జరిగిన దుబాయ్‌ వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌లో మారిన్‌పై సింధు విజయం సాధించిన విషయం తెలిసిందే.
హోరాహోరీగా సాగిన తొలి గేమ్‌లో ఒకానొక దశలో ఇరువురి మధ్య 16-16, 18-18, 19-19 పాయింట్లతో నువ్వానేనా అన్నట్లు పోరు సాగింది. అద్భుత ప్రదర్శనతో సింధు ఆ గేమ్‌ను 21-19తో ముగించింది. ఉత్కంఠగా సాగిన రెండో గేమ్‌లో సింధు ఆది నుంచి మారిన్‌పై పైచేయి సాధిస్తూ వచ్చింది. అద్భుతమైన ఆటతీరును కనబరుస్తూ 21-16 పాయింట్లతో రెండో గేమ్‌తోపాటు సిరీస్‌ను కైవసం చేసుకుంది.

ఈ విజయంతో సింధు కెరీర్‌లో రెండో సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ దక్కించుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com