కేటీఆర్ చొరవతో భారత్ కు చేరుకోనున్నగల్ఫ్ బాధితులు
- April 02, 2017
జీవనోపాధి కోసం ఇరాక్ వెళ్లి ఏజెంట్ల మోసాలతో అక్కడ చిక్కుకున్న 31 మంది తెలంగాణ, ఏపీకి చెందిన భవన నిర్మాణ కార్మికులు సోమవారం స్వదేశానికి చేరుకోనున్నారు. అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, గోదావరి జాల్లాలకు చెందిన 31 మంది భవన నిర్మాణ కార్మికులు విజిట్ వీసాలపై ఇరాక్ వెళ్లారు. వీసాలను పర్మినెంట్ చేస్తామని చెప్పి ఏజెంట్లు మోసం చేయడంతో కార్మికులకు పని దొరక్క, తిండి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
దీంతో బాధితులు తమ సమస్యలను తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం ప్రతినిధి బసంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కె. తారకరామారావు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మస్వరాజ్‌తో చర్చించారు. దీంతో ఆమె వెంటనే ఇరాక్‌లోని భారత రాయబారిని సంప్రదించి కార్మికులను స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేశారు. సోమవారం వీరందరూ దుబాయ్ మీదుగా ఢిల్లీ చేరుకోనున్నారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







