ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ విజేత తెలుగు తేజం
- April 02, 2017
తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు జైత్రయాత్ర కొనసాగుతోంది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచిన సింధు ఇప్పుడు ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో విజేతగా నిలిచింది. టాప్ సీడ్ స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్‌తో జరిగిన హోరాహోరీ పోరులో రెండు వరుస గేమ్‌ల్లో 21-19, 21-16తో విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో రియో ఒలింపిక్స్ ఫైనల్లో జరిగిన పరాభవానికి కరోలినాపై సింధు మరోసారి ప్రతీకారం తీర్చుకున్నట్లయ్యింది. రియో ఒలింపిక్స్ అనంతరం డిసెంబర్ 2016లో జరిగిన దుబాయ్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో మారిన్‌పై సింధు విజయం సాధించిన విషయం తెలిసిందే.
హోరాహోరీగా సాగిన తొలి గేమ్‌లో ఒకానొక దశలో ఇరువురి మధ్య 16-16, 18-18, 19-19 పాయింట్లతో నువ్వానేనా అన్నట్లు పోరు సాగింది. అద్భుత ప్రదర్శనతో సింధు ఆ గేమ్‌ను 21-19తో ముగించింది. ఉత్కంఠగా సాగిన రెండో గేమ్‌లో సింధు ఆది నుంచి మారిన్‌పై పైచేయి సాధిస్తూ వచ్చింది. అద్భుతమైన ఆటతీరును కనబరుస్తూ 21-16 పాయింట్లతో రెండో గేమ్‌తోపాటు సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ఈ విజయంతో సింధు కెరీర్లో రెండో సూపర్ సిరీస్ టైటిల్ దక్కించుకుంది.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







