దుమ్ము దులిపేసిన తెలుగు సింగర్ రేవంత్..
- April 02, 2017
ఇండియన్ ఐడల్ కిరీటం తెలుగు సింగర్ ఎల్వీ రేవంత్ సొంతమైంది. 25 ఏళ్ల రేవంత్.. సీజన్-9 ఫైనల్లో తన పాటలతో అందర్నీ కట్టిపడేశాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో తుది పోటీలో ఆయన విజేతగా నిలిచినట్లు మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ ప్రకటించాడు. చక్‌దే సినిమా నుంచి మర్ జాయోన్ యా జీ లూన్ జరా పాట పాడి జవాన్లను అంకితమిచ్చాడు.
ఇండియన్ ఐడల్ కిరీటంతోపాటు యూనివర్సల్ మ్యూజిక్ కంపెనీతో ఒప్పందం, రూ. 25 లక్షల నగదు బహుమతిని రేవంత్ గెలుచుకున్నాడు. పంజాబ్‌కు చెందిన ఖుదాబక్ష్ సెకండ్ ప్లేస్ కాగా, మరో తెలుగు కుర్రాడు రోహిత్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
శ్రీకాకుళంలో పుట్టిన రేవంత్, హైదరాబాద్‌లో సింగర్‌గా సెటిలయ్యాడు.
విశాఖ నుంచి ఎంట్రీ ఇచ్చిన రేవంత్, ఇండియన్ ఐడల్‌గా నిలిచిన రెండో తెలుగు సింగర్. టాలీవుడ్‌లో రేవంత్‌కు మంచి గుర్తింపు ఉంది. బాహుబలిలో ఆయన ఓ పాట పాడాడు.

తాజా వార్తలు
- అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు
- టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ...రవిచంద్రకు బాధ్యతలు
- ఫోన్ ట్యాపింగ్ కేసు.. KCR విచారణ ప్రారంభం
- విజయవాడలో వైభవంగా 'వివేకానంద మానవ వికాస కేంద్రం' ప్రారంభోత్సవం
- QR14.667 బిలియన్లకు POS, ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!







