మొదటి జెడ్డా ఫుడ్ ఫెస్టివల్ లో రుచికరమైన సాంస్కృతిక ఆతిధ్యం

- April 02, 2017 , by Maagulf
మొదటి జెడ్డా ఫుడ్ ఫెస్టివల్ లో రుచికరమైన సాంస్కృతిక ఆతిధ్యం

జెడ్డా:తొలి జెడ్డా ఫుడ్ ఫెస్టివల్ గత నెల మార్చి 30 వ తేదీ గురువారం నుండి లాంఛనంగా ప్రారంభమైంది. ఒకటో రెండు సాంస్కృతిక కార్యక్రమాలు నగరంలో రోజూ ఒక వినోద సంచలనం కల్గిస్తుంది. జెడ్డా చారిత్రికమైన ఉత్సవం ఏప్రిల్ 8 వ తేదీ (శనివారం ) వరకు కొనసాగనుంది. జెడ్డా కామర్స్ అండ్ ఇండస్ట్రీ జెడ చాంబర్ ( జె సి సి ఐ ) వద్ద  గవర్నర్ ప్రిన్స్ మిశాల్ బిన్ మజీద్ రాజుల ఆశ్రయం ఆతిథ్య కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా  నిర్వహించబడుతున్న ఈ పండుగ రెనాడ్ ఎగ్జిబిషన్ కంపెనీ సహకారంతో కొనసాగనుంది. 30,000 చదరపు మీటర్ల పొడవు విస్తీర్ణంలో ఏర్పాటైన జెడ్డా ఫుడ్ ఫెస్టివల్ లో 114 కంటే ఎక్కువ సంస్థలు, రెస్టారెంట్లు ఆసియా దేశాల  నుండి సంప్రదాయ అరబిక్ వంటకాలలో తమ వాటిని ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో కడుపుబ్బ నవ్వించే హాస్యం, ప్రేక్షకులను ఆకట్టుకొనే థియేటర్ ప్రదర్శన  మరియు ప్రత్యక్ష వంట కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు.కుటుంబాలు మరియు పిల్లల ఆనందంతో సహా 35 వివిధ రకాల వినోద కార్యకలాపాలను నిర్వాహకులు  ఏర్పాటుచేశారు. జెడ్డా కామర్స్ అండ్ ఇండస్ట్రీ జెడ చాంబర్ ( జె సి సి ఐ ) వైస్ చైర్మన్ మాజం బత్తెర్జీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, సాంస్కృతిక మార్పిడిలో ఆహరం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెప్పారు. పాఠశాల విరామ సమయంలో జరుగుతున్న ఈ జెడ్డా ఫుడ్ ఫెస్టివల్ కు వివిధ దేశాల నుంచే హాజరయ్యే పలువురు సందర్శకులకు  ప్రజలకు తాము వినూత్న ఆతిధ్యం ఇస్తున్నట్లు తెలిపారు.  వివిధ రకాల రుచులను ఆస్వాదించడానికి ఈ ఉత్సవం ఒక చక్కని అవకాశం అని ఆయన అన్నారు. జెడ్డా కామర్స్ అండ్ ఇండస్ట్రీ జెడ చాంబర్ ( జె సి సి ఐ ) వద్ద ఆతిధ్య కమిటీ చైర్మన్ ఎ.మునిఎఫ్ మహమ్మద్ మక్కి మాట్లాడుతూ, జెడ్డా ఫుడ్ ఫెస్టివల్, వార్షిక కార్యక్రమం మాదిరిగా మారిందని దేశీయ పర్యాటక రంగానికి మద్దతు పలికే ఇదో బృహత్తర కార్యక్రమం అని పేర్కొన్నారు సౌదీ ఆతిథ్య పరిశ్రమ ద్వారా విదేశీ, స్థానిక పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రోత్సహించడానికి దోహదపడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com