ప్రారంభమైన అఖిల్ సెకండ్ మూవీ..

- April 02, 2017 , by Maagulf
ప్రారంభమైన అఖిల్ సెకండ్ మూవీ..

అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన అఖిల్ సినిమా భారీ డిజాస్టర్ అవ్వడంతో చాలా గ్యాప్ తీసుకొని సెకండ్ సినిమా ను చేస్తున్నాడు. అఖిల్ సెకండ్ మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకొన్నది. అంటే అఖిల్ ఫస్ట్ మూవీ రిలీజై ఏడాదిన్నర తర్వాత తన రెండో సినిమాని మొదలు పెట్టాడు.. వివరాల్లోకి వెళ్తే.. 
సిసింద్రీ అఖిల్ హీరోగా అఖిల్ సినిమాతో 2015 లో వెండి తెరపై అడుగు పెట్టాడు. దీపావళి కానుకగా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. దీంతో అఖిల్ చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని పక్కా ప్లాన్ తో రెండవ సినిమాని అంగీకరించాడు.. ఈ సినిమా ఏప్రిల్ 2 న స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా పూజా కార్యక్రమానికి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ముఖ్యా అతిధిగా హాజరు కాగా నాగార్జున అమల దంపతులతో పాటు నాగ చైతన్య కూడా హాజరయ్యారు. దీంతో అఖిల్ రెండవ చిత్రం కోసం ఎంతో ఆతురతగా ఎదురు చూసిన అక్కినేని ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం మొదలైంది. అక్కినేని ఫ్యామిలీ మూడు తారలను ఒకే ఫ్రేమ్ లో చూపిస్తూ.. 'మనం' వంటి మంచి క్లాసికల్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై మంచి క్రేజ్ ఏర్పడింది. అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కూడా వెంటనే మొదలైంది. కాగా ఈ సినిమాకు మొదట జున్ను అనే టైటిల్ హల్ చల్ చేసినా.. తాజాగా మహేష్ బాబు సూపర్ హిట్ సాంగ్ పల్లవి "ఎక్కడ ఎక్కడ ఉందో తారక" అనే క్లాసీ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా అఖిల్ సరసన జోడీ కట్టే హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉన్నది.. మనం తో అక్కినేని ఫ్యామిలీకి ఎవర్ గ్రీన్స్ సాంగ్స్ ను అందించిన అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తోండగా... పివి వినోద్ సినిమాటోగ్రఫీ అందించబోతున్నారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com