గల్ఫ్ లో కర్టెన్ రైజర్ జరుపుకున్న'గల్ఫ్' సినిమా
- April 02, 2017
గల్ఫ్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి అక్కడి కార్మికుల కష్టాలు కానీ గల్ఫ్ అంటే కష్టాలే కాదు ఎన్నో విజయ గాధల సమాహారం అనే నేపథ్యంతో 'శ్రావ్య ఫిలిమ్స్' బ్యానర్ పై సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'గల్ఫ్'. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందరంభంగా ఉగాది ని పురస్కరించుకొని ఈ రోజు చిత్రం యూనిట్ 'కర్టెన్ రైజర్' ను గల్ఫ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రంలో ప్రత్యేక ఆకర్షణగా 'గల్ఫీ' నిర్వహించనున్నారు. గల్ఫ్ లో తీసుకున్న సెల్ఫీలే ఈ గల్ఫీ. మీరు తీసుకున్న సోలో సెల్ఫీ లేదా గ్రూప్ సెల్ఫీ అయినా [email protected] కు మెయిల్ లేదా GULF THE MOVIE ఫేస్బుక్ పేజీ కు పంపించి ఆకర్షణీయమైన బహుమతులను సొంతం చేసుకోండి అని చిత్ర దర్శకులు ప్రేక్షకులకు పిలుపునిచ్చారు. 'ఇన్స్పైర్ ఈవెంట్స్' మరియు 'మాగల్ఫ్.కామ్' వారు నిర్వహించిన ఈ కార్యక్రమానికి గల్ఫ్ లో నివసిస్తున్న పలువురు ప్రముఖులు - ఎరికి తులసి ప్రసాద్, రవి ఉట్నూరి, శ్రీకాంత్ చిత్తర్వు,రాజు,జనగం శ్రీనివాస్,శివ కుమార్,బసవయ్య,శేఖర్ హాజరయ్యి 'కర్టెన్ రైజర్' ను విజయవంతం చేశారు. గల్ఫ్ లోని తెలుగు న్యూస్ పోర్టల్ 'మాగల్ఫ్.కామ్' ఈ కార్యక్రమానికి మీడియా పార్టనర్ గా వ్యవహరించారు.
కెమెరా: ఎస్ వి శ్రీరామ్, సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి, ఎడిటింగ్: సామ్యూల్ కళ్యాణ్, మాటలు: పులగం చిన్నారాయణ,పాటలు: కాసర్ల శ్యాం,సిరాశ్రీ,ప్రవీణ్,మాస్టర్జీ,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి బాపి రాజు, కో ప్రొడ్యూసర్:డా.ఎల్ ఎం రావు, నిర్మాతలు:రాంకుమార్ మరియు యక్కలి రవీంద్ర బాబు, రచన & దర్శకత్వం: సునీల్ కుమార్ రెడ్డి.







తాజా వార్తలు
- 16వ ఆర్థిక సంఘం నివేదిక పై లోక్‌సభలో ఎంపీ బాలాశౌరి ప్రశ్న
- అగ్నివీర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..
- వెబ్ సమ్మిట్: టెక్ స్టార్టప్‌లకు $2 బిలియన్ల ప్రోత్సాహం..!!
- సౌదీలో 127 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- యూఏఈలో గోల్డ్, సిల్వర్ అమ్ముతున్న నివాసితులు..!!
- వాణిజ్య శాఖ పరిధిలోకి ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు..!!
- ముసందమ్లో తొమ్మిది మంది ఆసియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్ ఫిబ్రవరి ఇంధన ధరలు ఇవే..!!
- ఉక్రెయిన్‌లో శాంతి చర్చల ముందు రష్యా డ్రోన్ దాడి..15 మంది మృతి
- 30వేల మందికి లేఆఫ్స్ ఇవ్వనున్న ఒరాకిల్







