78 కిలోల దొంగ బంగారం విశాఖ విమానాశ్రయంలో

- April 03, 2017 , by Maagulf
78 కిలోల దొంగ బంగారం విశాఖ విమానాశ్రయంలో

కస్టమ్స్‌ కమిషనర్‌ బి హరేరామ్‌ వెల్లడి
 విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో గత ఏడాది (2016-17) 78 కిలోల దొంగ బంగారాన్ని స్వాధీ నం చేసుకున్నట్టు కస్ట మ్స్‌ కమిషనర్‌ బి హరేమార్‌ తెలిపారు. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.4,609 కోట్ల ఆదాయాన్ని సాధించామని సోమవారం ఆయన చెప్పారు. వాస్తవానికి సెంట్రల్‌ ఎక్సైజ్‌, కస్టమ్స్‌ బోర్డు రూ.4,468 కోట్లు లక్ష్యంగా నిర్దేశించగా.. అంతకు 4.28 శాతం ఎక్కువ నమోదు చేశామన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఆదాయంలో 16.39 శాతం వృద్ధి సాధించామన్నారు. విశాఖ విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్న వివిధ వస్తువుల ద్వారా రూ.22.42 కోట్లు రాబట్టామన్నారు.
పన్ను చెల్లించని వారి నుంచి రూ.4.01 కోట్లు వసూలు చేశామన్నారు. వ్యాపార వర్గాలకు రూ.659 కోట్లు రిఫండ్‌ చేశామన్నారు. గత ఏడా ది కంటే ఈ మొత్తం 53 కోట్లు అధికమని వివరించారు. ఎగుమతి, దిగుమతుల వ్యాపార వేగవంతానికి త్వరగా క్లియరెన్సలు ఇస్తున్నామని, సరుకు దిగుమతికి సగటున 2.37 రోజులు, ఎగుమతికి 2.85 రోజులు తీసుకుంటున్నామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com