2017 ఐపీఎల్ 10 ప్రారంభోత్సవం రేపు
- April 03, 2017
మధ్యలో ట్రోఫీ.. అటు ఇటూ సారథులు.. దిగ్గజ క్రికెటర్లు.. ఆటపాటలు.. విందు, వినోదాలతో సాగే ఐపీఎల్ ఆరంభోత్సవంలో ఈసారి చిన్న మార్పు! గత తొమ్మిదేళ్ళు తొలి మ్యాచ్ వేదికలోనే ఆరంభోత్సవాలు జరగ్గా.. ఐపీఎల్‌లోని 8 జట్లు వారి సొంతగడ్డపై ప్రారంభోత్సవాల్ని నిర్వహిస్తుండటం ఈసారి ప్రత్యేకత. అందులో మొదటి అంకం హైదరాబాద్‌లోనే. వేదిక ఉప్పల్ స్టేడియమే. ఐపీఎల్‌లో ఇది పదో సీజన్ కావడంతో దీన్ని ప్రత్యేకంగా భావించి స్థానిక ప్రేక్షకులకు వినోదం పంచాలన్న ఫ్రాంచైజీల కోరిక మేరకు 8 వేదికల్లో ఆరంభ వేడుకల్ని నిర్వహించాలని ఐపీఎల్ పాలక మండలి నిర్ణయించింది. ప్రతి ఫ్రాంచైజీ తన సొంతగడ్డపై తలపడే మొదటి మ్యాచ్‌కు ముందు ఆరంభోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఈనేపథ్యంలో హైదరాబాద్‌దే మొదటి వంతు. బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్‌కు ముందు ఉప్పల్ స్టేడియంలో ఆరంభ వేడుకలు నిర్వహించనున్నారు. అరగంట పాటు ఆరంభోత్సవం ఉంటుంది. సాయంత్రం 6.20కి దిగ్గజ క్రికెటర్లు సచిన్ తెందుల్కర్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ గోల్ఫ్ కార్ట్‌లలో మైదానంలోకి వస్తారు. దిగ్గజాల ఘనతలను కీర్తిస్తూ ఆడియో, వీడియో ప్రదర్శించాక సన్మానం ఉంటుంది. అనంతరం ఐదుగురు క్రికెటర్లు మాట్లాడతారు. ఈ కార్యక్రమానికి రవిశాస్త్రి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తాడు. తర్వాత బాలీవుడ్ నటి అమీ జాక్సన్ 300 మంది డ్యాన్సర్లతో కలిసి నృత్య ప్రదర్శన ఇవ్వనుంది. అనంతరం ఎ.ఆర్.రెహమాన్ బృందం ప్రదర్శన ఉంటుంది. రెహమాన్ రాకపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో అతని సహాయకులు ప్రదర్శన ఇవ్వనున్నట్లు తెలిసింది. ఆరంభ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముఖ్యఅతిథిగా విచ్చేస్తారు. 7 గంటలకు మైదానంలో సన్‌రైజర్స్, బెంగళూరు ఆటగాళ్ళ వార్మప్ మొదలవుతుంది. 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!
- బహ్రెయిన్ లో రమదాన్ మద్దతుకు ఎంపీల ప్రతిపాదన..!!
- కువైట్ లో స్మార్ట్ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టం అమలు..!!
- రుస్తాక్ వింటర్ ఫెస్టివల్ 2026 ప్రారంభం..!!
- ద్వైపాక్షిక సంబంధాలు.. సౌదీ క్రౌన్ ప్రిన్స్, పుతిన్ చర్చలు..!!
- రమదాన్ కంటే ముందే పరీక్షల షెడ్యూల్ సర్దుబాటు..!!
- స్కూల్ పిల్లలకు ఉచితంగా ఆధార్ క్యాంపులు
- ముంచెత్తిన తీవ్ర హిమపాతం..35 మంది మృతి
- భారత్‌లో గూగుల్ మెగా ప్లాన్..20 వేల ఉద్యోగాలు రెడీ
- ఈ నెల 18న బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ







