వీసాలపై బ్రిటన్ భారీ వసూళ్లు
- April 04, 2017
ఐటీ, హెల్త్, ఎడ్యుకేషన్ తదితర రంగాల ప్రొఫెషనల్స్ కు వీసాలు జారీ చేసే విషయంలో బ్రిటన్ సరికొత్త ప్రతిబంధకాలను విధించనుంది. బ్రిటన్ లోని ఆయా సంస్థల్లో పనిచేస్తూ, ఎక్కువ మొత్తంలో వేతనాలు పొందే వలస ఉద్యోగుల నుంచి భారీ మొత్తంలో 'వసూళ్లు' చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇమిగ్రేషన్ స్కిల్ చార్జీలు, హెల్త్ సర్ చార్జీలు తదితర రూపాల్లో ఏటా 200 పౌండ్ల నుంచి 1000 పౌండ్ల దాకా వసూలు చేయనున్నారు. ఏప్రిల్ 6(గురువారం) నుంచే ఈ నూతన నిబంధనలు అమలులోకి వస్తాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
వీసాల విషయంలో బ్రిటన్ తీసుకున్న ఈ నిర్ణయం భారత్ సహా యురోపియన్ యూనియన్ లో సభ్యులు కాని దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. బ్రెగ్జిట్ అనంతరం బ్రిటన్ స్వతంత్ర ఆర్థిక శక్తిగా నిలబడాలంటే ఉద్యోగాల్లో అధిక భాగం స్థానికులకే దక్కాలన్నది అక్కడి ప్రభుత్వ ఆలోచన. అందుకే, ఏప్రిల్ 6 నుంచి వలసదాల నుంచి వసూలయ్యే పన్నుల ద్వారా నిధిని ఏర్పాటుచేసి, ఆ నిధిలో నుంచి అధిక మొత్తాన్ని బ్రిటిషర్లకు ఉద్యోగాల కల్పన కోసం పనిచేసే సంస్థలకు ప్రోత్సాహకాలుగా ఇవ్వనున్నారు.
అలాగే ఇంటర్ కంపెనీ ట్రాన్స్ ఫర్ (ఐసీటీ)పై బ్రిటన్ లో పనిచేసేందుకు వచ్చే ప్రొఫెషనల్స్ , టైర్ 2, డిపెండెంట్ వీసాలపై కూడా ఇదే తరహాలో బాదుడు ఉండబోతోంది. కాగా, ఇమిగ్రేషన్ స్కిల్ చార్జీలు, హెల్త్ సర్ చార్జీల భారాన్ని ఆయా సంస్థలే భరించాలని నిబంధనల్లో పేర్కొనడంతో పరిశ్రమ వర్గాల్లో ఆందోళన నెలకొంది. అంతేకాదు, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేషన్ లోనూ మరికొన్ని నిబంధనలు చేర్చారు. మొత్తంగా వీసా ప్రక్రియ ఖర్చు పెరగడంతోపాటు, కఠినతరమవుతుంది. వచ్చే ఏడాది నుంచి ఈ నిబంధనలన్నీ యురోపియన్ యూనియన్ దేశాల నుంచి వచ్చే ఉద్యోగార్థులకూ వర్తింపజేసే అవకాశం ఉంది. అమెరికాలో ట్రంప్ రాకతో మొదలైన వీసాలపై కఠిన నిబంధనలు మొదలుకావడం, మొన్న మలేషియా, నేడు బ్రిటన్.. ఇలా క్రమంగా పలు దేశాలు కూడా అమెరికా బాటలో పయనిస్తుండటం.. మేధోవలసలు అధికంగా ఉండే భారత్ లాంటి దేశాలను కలవరపాటుకు గురిచేస్తోంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







