'బావర్చి'పై కేసు కుళ్లి కంపుకొడుతున్న చికెన్‌తో బిర్యానీ సప్లై చేస్తున్నందుకు
- April 06, 2017
ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు నగరంలోని హోటల్స్‌పై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఎల్.బి నగర్ లోని ది న్యూ గ్రీన్ బావర్చి హోటల్ ను అధికారులు తనిఖీ చేశారు. కస్టమర్ల ఆరోగ్యాన్ని ఏమాత్రం దృష్టిలో ఉంచుకోకుండా కుళ్లి కంపు కొడుతున్న ఆహార పదార్థాలతో బిర్యానీ వండుతున్నట్లుగా గుర్తించారు.
పాడైపోయిన చికెన్, ఈగలు వాలిన ఆహారపదార్థాలను గుర్తించిన అధికారులు హోటల్ యాజమాన్యాన్ని దీనిపై నిలదీశారు. కస్టమర్ల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా, కనీస నిబంధనలను కూడా పట్టించుకోవడం లేదన్న కారణంగా రూ.10వేల జరిమానా విధించి హోటల్ పై కేసు నమోదు చేశారు.
కాగా, గత కొద్దిరోజులుగా హైదరాబాద్‌లోని పలు హోటల్స్, రెస్టారెంట్లపై జీహెచ్‌ఎంసీ ప్రజారోగ్య శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో నిబంధనలు పాటించని హోటల్స్ పై కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కస్టమర్ల ఆరోగ్యంతో చెలగాటమాడే హోటల్స్ ను ఉపేక్షించబోమని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- యూపీఐ ద్వారా పీఎఫ్..
- IAF Jobs 2026: వాయుసేనలో అగ్నివీర్ ఉద్యోగాలు
- షార్లెట్‌లో ఘనంగా NATS చదరంగం పోటీలు
- హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్న అమెరికా దిగ్గజం కాస్ట్కో
- భారత్ లో వాటర్ మెట్రోలు ఏర్పాటుకు కేంద్రం భారీ ప్లాన్!
- 1.6 మిలియన్ల మందికి ఉచిత ఇఫ్తార్ మీల్స్..!!
- అక్రమ చేపల వేట, ఆఫీసర్ పై దాడి..ముగ్గురు అరెస్టు..!!
- యూకే యువరాజు విలియంకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ స్వాగతం..!!
- రమదాన్ లో గ్రీన్ బహ్రెయిన్ కు మద్దతు..!!
- మస్కట్‌లో డ్రాగన్ ఆటో ఫెస్ట్ 2026..!!









