సిరియాలో 33 మంది యువకులను హతమార్చిన ఐసిస్
- April 06, 2017
తూర్పు సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు 33 మంది యువకులను అతి కిరాతకంగా చంపారు. ఐఎస్ ఉగ్రవాదులు బుధవారం దీర్-ఎల్-జౌర్ ప్రావిన్స్‌లోని మయాదీన్ పట్టణంలో యువకుల గొంతు కోసి ఘోరంగా హతమార్చినట్లు బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే సంస్థ తెలిపింది. హత్యకు గురైన వారు సిరియన్ భద్రతా బలగాలకు చెందిన వారా లేక రెబల్ గ్రూపునకు చెందిన వారా అనేది స్పష్టంగా తెలియలేదని పేర్కొంది.
ఐఎస్ ఉగ్రవాదులు ఇలాంటి హత్యలను గత సంవత్సర కాలముగా పాల్పడుతున్నారని యూరప్‌లో నివసిస్తోన్న ఓ సిరియన్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో కిరాతకంగా తలలు నరకడం, బ్రతికి ఉన్న వారిని నీళ్లలో ముంచి సజీవంగా చంపేయడం.. వాటిని ఫోటోలు,విడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేయడం వంటి చర్యలు ఐఎస్ ఉగ్రవాదుల పనేనన్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







