‘కసబా’ చిత్రంలో మమ్ముట్టి సరసన మళ్లీ వరలక్ష్మి
- April 06, 2017
తమిళంలో ‘పోడా పోడి’, ‘తారై తప్పట్టె’ చిత్రాల్లో నటించిన వరలక్ష్మి శరత్‌కుమార్ గత సంవత్సరం ‘కసబా’ చిత్రం ద్వారా మలయాళ చిత్రసీమకు పరిచయమయ్యారు. అందులో మమ్ముట్టి హీరోగా నటించారు. ఈ సంవత్సరం సముద్రగని దర్శకత్వంలోని ‘అప్పా’ తమిళ చిత్రం మలయాళంలో పునర్నిర్మించనుండగా అందులో నటించే అవకాశం వరలక్ష్మికి లభించినా పూజ జరిగిన కొద్ది రోజుల్లోనే ఆ చిత్రం నుంచి వైదొలగినట్లు ఆమె ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరో మలయాళ చిత్రంలో నటించే అవకాశం ఆమెకు వచ్చింది. ఈ చిత్రంలోనూ హీరో మమ్ముట్టి కావడం గమనార్హం. మమ్ముట్టితో ‘రాజాధి రాజా’ అనే మలయాళ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు అజయ్ వాసుదేవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
‘రాజాధి రాజా’లో మమ్ముట్టికి జంటగా రాయ్‌లక్ష్మీ నటించడంతో ప్రస్తుత చిత్రంలోనూ మమ్ముట్టి సరసన ఆమెనే నటిస్తుందని మొదట భావించారు. అనివార్య కారణాలతో ఆమె నటించడానికి సాధ్యపడకపోవడంతో ఆ అవకాశం వరలక్ష్మిని వరించింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







