ప్రభుత్వ, అసైన్డ్ భూములు కలిపి బందరు పోర్టుకు 3,014.43 ఎకరాలు
- April 06, 2017
బందరు పోర్టు నిర్మాణానికి అడ్డంకులు క్రమంగా తొలగిపోతున్నాయి. పోర్టు నిర్మాణానికి ముందుకు వచ్చిన డెవలపర్ సంస్థ మచిలీపట్నం పోర్టు లిమిటెడ్‌కు 3014.43 ఎకరాల భూమిని అప్పగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో ప్రభుత్వ భూములు 2360.52 ఎకరాలు, అసైన్డ్ భూములు 653.91 ఎకరాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ భూములను రెవెన్యూ శాఖ నుంచి పోర్టు శాఖ ఎప్పుడో తన ఆధీనంలోకి తీసుకుంది. అయితే.. ఏళ్ల తరబడి పోర్టు నిర్మాణంలో కదలిక లేకపోవడంతో.. ఈ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఈ ఆక్రమణలు పెరిగితే.. పోర్టు నిర్మాణానికి అడ్డకులు ఎదురవుతాయని ఈ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ ఆందోళన వ్యక్తం చేసిందని పోర్టు శాఖ పేర్కొంది.
ఈ భూములను పరిరక్షించాలంటే పోర్టు లిమిటెడ్‌కు తక్షణమే భూములు అప్పగించడం మంచిదని పోర్టు శాఖ సూచించింది. ఈ సూచన మేరకు.. ప్రభుత్వం మచిలీపట్నం పోర్టుకు అప్పగించడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చింది. ఈ భూములను పోలీసు, పోర్టు, రెవెన్యూ యంత్రాంగం సాయంతో.. డెవలప్ సంస్థకు అప్పగించాలని ఈ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ మేరకు మచిలీపట్నం ఆర్‌డిఒ, పోలీసు ఇన్స్పెక్టర్, ఎంఎడిఎ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పోర్టు కన్జర్వేటర్ సమక్షంలో డెవలపర్ సంస్థకు భూములు అప్పగించాలని ప్రభుత్వం ఆదేశించింది.
తాజా వార్తలు
- ICC T20 World Cup 2026: ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం
- నాలుగో అత్యంత విలువైన సంస్థగా SBI
- కెనడా స్కూల్లో కాల్పులు..10 మంది మృతి
- BHELలో 5 శాతం వాటాల విక్రయం..
- పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్: మునిసిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ దే హవా!
- తెలంగాణ: మున్సిపల్ పోలింగ్ ముగిసింది
- సామాజిక రక్షణ పథకాల కవరేజ్ గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గింది..రాహుల్‌గాంధీ
- రేపు భారత్ బంద్..
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు









