సౌదీ అరేబియా లాకప్ లో ఎన్నారై అనుమానాస్పద మృతి.. విచారణకు డిమాండ్
- April 06, 2017
లాకప్ మరణాలు మన దేశంలోనే కాదు ఎడారి దేశంలోనూ జరగడం పలువురికి ఆశ్చర్యం కల్గిస్తుంది. వాదిత్య శ్రీనివాస్ అనే 30 ఏళ్ళ ప్రవాసియ భారతీయుడు సౌదీ అరేబియా పోలీసు కస్టడీలో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం పట్ల ఆయన తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ కుమారుడు ఆకస్మికంగా చనిపోవడంపై పలు సందేహాలు ఉన్నాయని ఆ మృతి పట్ల సరైన దర్యాప్తు చేయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27 వ తేదీ రియాద్ లోని వాదిత్య శ్రీనివాస్ ను ఒక ట్రాఫిక్ ఉల్లంఘన కేసులో పోలీసులు అరెస్టు చేశారు. అల్ మొరాబా పోలీసు స్టేషన్ లో నిర్బంధించారు. ఆ తర్వాత శ్రీనివాస్ ఉరి వేసుకొని మరణించినట్లు వెలుగులోకి వచ్చింది. మరణించిన వాదిత్య శ్రీనివాస్ అన్నయ్య వెంకటేష్ మాట్లాడుతూ.. తన తమ్ముడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు మాత్రం కాదని వాదిస్తున్నాడు. పోలీసు స్టేషన్ లో ఆత్మహత్య చేసుకొన్నట్లు పోలీసులు చిత్రీకరిస్తున్నారని.. కానీ తన సోదరుడి మరరణం చాలా అనుమానాస్పదంగా ఉందని తెలిపారు. పోలీసులు తన తమ్ముడు జేబులో ఉన్న మొబైల్ మరియు పర్సు గురించి ఏమీ చెప్పలేకపోతున్నారని.. ఇదంతా చూస్తుంటే, వారు ఏదో "తప్పుడు నాటకం" ఆడుతున్నట్లు అనుమానంగా ఉందని ఆయన అన్నారు. వెంకటేష్ సైతం కొన్నాళ్ల క్రితం రియాద్ లో పని చేసినపుడు అదే ప్రాంతంలో నివసించాడు. తనకు నాసిరియా ప్రాంతంలో తనకు ఉన్న స్థానిక స్నేహితుల సహకారంతో లాకప్ లో అనుమానాస్పదంగా చనిపోయిన తన తమ్ముడు వాదిత్య శ్రీనివాస్ అనుమానాస్పద మరణం గూర్చి ఫిర్యాదు చేశారు. అంతేకాక, భారతదేశంలోని తెలంగాణా రాష్ట్రం లోని వికారాబాద్ జిల్లా కలెక్టర్ డి. విద్య ను సోమవారం కల్సి ఆమె చేతికి ఒక అర్జీని వాదిత్య శ్రీనివాస్, వెంకటేష్ తండ్రి వాదిత్య గోవింద్ అందచేశారు. తన కుమారుడి నిర్భంధ మరణం గూర్చి సమగ్ర పరిశోధన జరిపించాలని, సౌదీ అధికారులతో జరిపించేలా చర్యలు తీసుకోవాలని ఆ వృద్ధ తండ్రి ఆమెను అభ్యర్ధించారు. పోలీసులు ఈ సంఘటన జరిగినప్పుడు వారి నిర్బంధంలో తన సోదరుడు ఉన్నారని కనుక తన తమ్ముడి మరణంకు పూర్తి బాధ్యత పోలీసులదేనని వెంకటేష్ డిమాండ్ చేసాడు. ఒక వ్యక్తి రియాద్ పోలీసు స్టేషన్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొనే మార్గమే లేదని వెంకటేష్ ఒక కీలకాధారం ఎత్తి చూపారు. ఫోరెన్సిక్ నివేదికలో 'ఉరి ద్వారా ఊపిరి ఆడనందు వల్ల గుండె మరియు శ్వాస ఆగిపోవడం వాదిత్య శ్రీనివాస్ మరణానికి ప్రధాన కారణమని ఉన్నది.
తాజా వార్తలు
- ICC T20 World Cup 2026: ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం
- నాలుగో అత్యంత విలువైన సంస్థగా SBI
- కెనడా స్కూల్లో కాల్పులు..10 మంది మృతి
- BHELలో 5 శాతం వాటాల విక్రయం..
- పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్: మునిసిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ దే హవా!
- తెలంగాణ: మున్సిపల్ పోలింగ్ ముగిసింది
- సామాజిక రక్షణ పథకాల కవరేజ్ గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గింది..రాహుల్‌గాంధీ
- రేపు భారత్ బంద్..
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు









