దుబాయ్ లో 'ఇండియన్ ఐడల్ రేవంత్'

- April 07, 2017 , by Maagulf

రేవంత్ టాలీవుడ్ లో మంచి సింగర్ గా అవకాశాలు అందుకోంటూనే "ఇండియన్ ఐడల్" షో లో పాల్గొని విజేతగా నిలిచాడు.. రేవంత్ ప్రతిభకు సినీ సెలబ్రేటీల నుంచి సామాన్యుల వరకూ అభిమానులే.. అనేక ఆఫర్స్ అందుకొంటున్న రేవంత్ తాజాగా దుబాయ్ లో శ్రీలలిత ఈవెంట్స్ నిర్వహణ లో తెలుగు-కన్నడ డాన్స్ మరియు మ్యూజికల్ నైట్లో పాల్గొననున్నాడు.. ఈ కార్యక్రంలో పాల్గొనడానికి దుబాయ్ కు చేరుకొన్న రేవంత్ కు ఈవెంట్ సభ్యులు కుమార్(మ్యానేజింగ్ డైరెక్టర్), అరుణ్ కుమార్(ఈవెంట్ మేనేజర్), శ్రీనివాస్, వెంకట్, గౌతమ్ ఎయిర్ పోర్ట్ లో ఘనస్వాగతం పలికారు. ఈ రోజు సాయంత్రం జబీల్ పార్క్ లో ప్రేక్షకులను తన పాటలతో రేవంత్ ఉర్రూతలూగించన్నారు. ఈ కార్యక్రమానికి  మాగల్ఫ్.కాం మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com