సిట్రా కాజ్‌వే, ఎస్తిక్లాల్‌ హైవే మూసివేత

- April 07, 2017 , by Maagulf
సిట్రా కాజ్‌వే, ఎస్తిక్లాల్‌ హైవే మూసివేత

మనామా: మినిస్ట్రీ ఆఫ్‌ వర్క్స్‌, మునిసిపాలిటీ ఎఫైర్స్‌ అండ్‌ అర్బన్‌ ప్లానింగ్‌, జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌ సంయుక్తంగా ఓ ప్రకటన జారీ చేశాయి. ఈ ప్రకటన సారాంశం ఏమిటంటే సిట్రా కాజ్‌వే మరియు ఎస్తిక్లాల్‌ హైవే - మెయిన్‌టెనెన్స్‌ వర్క్స్‌ కారణంగా మూసివేయబడింది. నిన్ననే సిట్రా కాజ్‌ వేపై ఒకటి మరియు రెండు లేన్లు మూసివేశారు. అవి రేపు ఉదయం తెరుచుకోనున్నాయి. ఎస్తిక్‌లాల్‌ హైవే - అల్బా రౌండ్‌ ఎబౌట్‌ వద్ద మూసివేయబడ్తుంది. మూసివేతలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని వాహనదారులకు సూచికల రూపంలో తెలియజేస్తున్నారు అధికారులు. అధికారులు అందించిన సమాచారంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించడం జరుగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com