తమిళనాడు లో ప్రముఖుల ఇంటిపై ఐటీ దాడులు
- April 07, 2017
నటుడు శరత్ కుమార్‌కు ఐటీ అధికారులు సడన్ షాకిచ్చారు.! జయలలిత మరణంతో ఆర్కేనగర్ నియోజకవర్గంలో త్వరలో ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో చెన్నైలో పలువురు ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు తమిళనాట కలకలం సృష్టిస్తున్నాయి. కాగా ఈ ఉప ఎన్నికలో శరత్ కుమార్.. దినకరణ్‌కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంలో ఐటీ సోదాలు జరగడం గమనార్హం. ఇవాళ సాయంత్రం నుంచి కొట్టివక్కమ్‌లోని శరత్ కుమార్ ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే శరత్ కుమార్‌తో పాటు ఆరోగ్య మంత్రి విజయ్ భాస్కర్ ఇంటిపైనా ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో సోదాలు నిర్వహిస్తున్నారని సమాచారం. కాగా ఆరోగ్యమంత్రికి టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డికి సంబంధాలున్నాయని తెలుస్తోంది. అయితే ఈ సోదాలకు సంబంధించి ఇంత వరకు ఐటీ అధికారులు ఎక్కడా వివరాలు వెల్లడించలేదు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







