తమిళనాడు లో ప్రముఖుల ఇంటిపై ఐటీ దాడులు

- April 07, 2017 , by Maagulf
తమిళనాడు లో ప్రముఖుల ఇంటిపై ఐటీ దాడులు

నటుడు శరత్ కుమార్‌కు ఐటీ అధికారులు సడన్ షాకిచ్చారు.! జయలలిత మరణంతో ఆర్కేనగర్ నియోజకవర్గంలో త్వరలో ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో చెన్నైలో పలువురు ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు తమిళనాట కలకలం సృష్టిస్తున్నాయి. కాగా ఈ ఉప ఎన్నికలో శరత్ కుమార్.. దినకరణ్‌కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంలో ఐటీ సోదాలు జరగడం గమనార్హం. ఇవాళ సాయంత్రం నుంచి కొట్టివక్కమ్‌లోని శరత్ కుమార్ ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే శరత్ కుమార్‌తో పాటు ఆరోగ్య మంత్రి విజయ్ భాస్కర్ ఇంటిపైనా ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో సోదాలు నిర్వహిస్తున్నారని సమాచారం. కాగా ఆరోగ్యమంత్రికి టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డికి సంబంధాలున్నాయని తెలుస్తోంది. అయితే ఈ సోదాలకు సంబంధించి ఇంత వరకు ఐటీ అధికారులు ఎక్కడా వివరాలు వెల్లడించలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com