జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు, ముగ్గురు మృతి
- April 07, 2017
స్వీడన్ స్టాక్‌హోం నగరంలో నిత్యం జనసమ్మర్దం ఉండే అహ్లెన్స్ మాల్‌పై ఓ మృత్యుశకటం విరుచుకుపడింది. ఓ దుండగుడు వేగంగా ట్రక్కును జనంపైకి దూకించడంతో వందలాది మంది హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. షారింగ్ ఏరియాలో ఓ ట్రక్కు స్వైరవిహారం చేయడం, జనాలు పరుగులెత్తడంతో హుటాహుటిన రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. మెయిన్ స్ట్రీట్‌లోకి అడుగుపెట్టగానే భారీ ట్రక్కు అదుపు తప్పి వేగంగా దూసుకుపోవడం చూశానని, దీంతో పలువురు పరుగులు తీసినట్టు ఓ ప్రత్యక్ష్య సాక్షి తెలిపారు. లారీని ఎవరైనా డ్రైవ్ చేస్తున్నారా లేదా అనేది తాను చూడలేదన్నాడు. షాపింగ్ సెంటర్ వెలుపల వందలాది మంది ప్రాణాలు అరచేతిలో ఉంచుకుని పరుగులు తీసినట్టు మరో ప్రత్యక్ష్య సాక్షి తెలిపారు. కాగా, ఇది ఉగ్రదాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆగంతకుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్‌లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం









