హత్యకేసులో 20 ఏళ్ళ జైలు శిక్ష
- April 08, 2017
సెక్యూరిటీ ఉద్యోగి హత్య కేసులో కొరియాకి చెందిన వ్యక్తికి 20 ఏళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఇదే కేసులో మరో ముగ్గురికి మూడేళ్ళ జైలు శిక్ష, డిపోర్టేషన్‌ని న్యాయస్థానం విధించడం జరిగింది. అలాగే, నలుగురు వ్యక్తులూ కలిసి బ్లడ్ మనీ 200,000 ఖతారీ రియాల్స్‌ని బాధిత కుటుంబానికి చెల్లించాలని ఆదేశించింది న్యాయస్థానం. ఓ కంపెనీలోకి అక్రమంగా ప్రవేశించి, అందులోని ఐరన్ సేఫ్‌ని దొంగిలించే క్రమంలో సెక్యూరిటీ ఉద్యోగిని నిందితులు హతమార్చారు. మరో కేసులో దోహా క్రిమినల్ కోర్టు, ఇండోనేసియాకి చెందిన వ్యక్తికి ఏడాది జైలు శిక్ష, డిపోర్టేషన్‌ని విధించింది. షాపింగ్ మాల్‌లో దొంగతనం చేసిన నేరంపై నిందితుడు అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. దొంగిలించిన వస్తువులతో షాపింగ్ మాల్ నుంచి పారిపోయిన ఆ వ్యక్తి, మూడు రోజుల తర్వాత తిరిగి అదే షాపింగ్ మాల్‌కి వెళ్ళగా సెక్యూరిటీ కెమెరా ద్వారా అతన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని, పోలీసులకు అప్పగించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..









