అరటి బచ్చలి కూర

- April 08, 2017 , by Maagulf
అరటి బచ్చలి కూర

కావలసిన పదార్థాలు: కూర అరటికాయలు - 2, బచ్చలి కూర -1 కట్ట, పచ్చిమిర్చి - 4, చింతపండు రసం - 1 టేబుల్‌ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - అర టీ స్పూను, ఆవ పిండి - అర టీ స్పూను, నువ్వుపొడి - 2 టీ స్పూన్లు, అల్లం ముక్కలు - 1 టీ స్పూను, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు - తాలింపు సరిపడా.
తయారుచేసే విధానం: అరటికాయల తొక్కతీసి చిన్న ముక్కలుగా తరగాలి. ఒక పాత్రలో అరటి ముక్కలు, బచ్చలి తరుగు, ఉప్పు, పసుపు, చింతపండు గుజ్జు వేసి కొంత నీరు జతచేస్తూ మెత్తగా ఉడికించుకుని నీరు వార్చేయాలి. మూకుడులో తాలింపుతో పాటు అల్లం, మిర్చి తరుగు వేగించి అరటి మిశ్రమాన్ని కలపాలి. 2 నిమిషాలయ్యాక ఆవ నువ్వు పొడుల్ని కలుపుకోవాలి. ఇది అన్నంతో చాలా బాగుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com