దుబాయ్ లో జోరందుకున్న 'గళ్ఫీ' ప్రమోషన్
- April 09, 2017

గల్ఫ్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి అక్కడి కార్మికుల కష్టాలు కానీ గల్ఫ్ అంటే కష్టాలే కాదు ఎన్నో విజయ గాధల సమాహారం అనే నేపథ్యంతో 'శ్రావ్య ఫిలిమ్స్' బ్యానర్ పై సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'గల్ఫ్'. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్బంగా "గల్ఫ్" చిత్ర దుబాయ్ అంబాసిడర్ "రవి ఊట్నూరి" మరియు సొనపూర్ ప్రముఖులు “నేరువట్ల బాబుస్వామి” ఆధ్వర్యంలో నిన్న సొనపూర్(దుబాయ్) ఏరియా లొ "గల్ఫ్" చిత్రం గురించి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమం లొ ప్రత్యేక ఆకర్షణగా "గల్ఫీ" నిర్వహించారు, పలువురు చాలా ఉత్సాహంగా "గల్ఫీ" కాంటెస్టు లొ పాల్గొని ఆనందం వ్యక్తం చేసారు. గల్ఫ్ లో తీసుకున్న సెల్ఫీలే ఈ “గల్ఫీ”. మీరు తీసుకున్న సోలో సెల్ఫీ లేదా గ్రూప్ సెల్ఫీ అయినా [email protected] కు మెయిల్ లేదా GULF THE MOVIE ఫేస్బుక్ పేజీ కు పంపించి ఆకర్షణీయమైన బహుమతులను సొంతం చేసుకోండి అని చిత్ర దర్శకులు ప్రేక్షకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సొనపూర్ లో నివసిస్తున్న భూమెష్వర్, లక్ష్మన్, శేకర్, సవిన్, నవీన్, సీనువాసు, శ్రీపాల్ రెడ్డి, సాయిరెడ్డి, సత్యం, మల్లెష్, రెడ్డి, గంగరాజు, సత్తయ్య, మల్లయ్య, మనోహర్, సునీల్ హాజరయ్యి విజయవంతం చేశారు.







తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









