భారత పడవను విడిపించిన సోమాలియా దేశ సైన్యం
- April 10, 2017
సోమాలియా సముద్రపు దొంగలు వారం రోజుల క్రితం నిర్బంధించిన భారత పడవను ఆ దేశ సైన్యం రక్షించింది. పడవలోని ఇద్దరు భారతీయులను కాపాడింది. అయితే మరో తొమ్మిది మంది భారతీయులు ఇంకా దొంగల నిర్బంధంలోనే ఉన్నారని హొబ్యో నగర మేయర్ అబ్దుల్లాహి అహ్మద్ సోమవారం తెలిపారు. ఐదేళ్లుగా ఇక్కడి తీరంలో గస్తీపై ప్రపంచ దేశాలు దృష్టిపెట్టడంతో దాడులు కొంతవరకూ తగ్గుముఖం పట్టాయి. సోమాలియా ప్రభుత్వ అస్థిరత్వం కారణంగా ఇటీవల కాలంలో మళ్లీ దాడులు పెరుగుతున్నాయి.
తొమ్మిది మంది సైనికుల మృతి
సొమాలియా రాజధాని మొగదిషు శివారులో సైనిక దుస్తులు ధరించిన ఓ ఉగ్రవాది ఒక సైనిక శిక్షణ శిబిరంపై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. సోమవారం జరిగిన ఈ ఘటనలో తొమ్మిది మంది సైనికులు మృతిచెందారు. మరో 12 మంది గాయపడ్డారు. దాడి తమ పనేనని అల్‌ఖైదా అనుబంధ అల్ షబాబ్ చెప్పింది. మరో ఘటనలో కారు బాంబు పేలడంతో ఒక ప్రభుత్వాధికారి మరణించారు.
ఆదివారం మొగదిషు సైనిక స్థావరం వెలుపల కారు బాంబు పేలుడు సంభవించడంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









