మోదీ మెచ్చిన ‘దీవార్’ సినిమా పోస్టర్
- April 12, 2017
భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం పోస్టర్ల రూపంలో ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, శశికపూర్, నిరూపా రాయ్ నటించిన ‘దీవార్’ సినిమా పోస్టర్‌పై స్వచ్ఛ భారత్ గురించి వివరిస్తూ రాసిన డైలాగ్ వైరల్‌గా మారింది. ఆ సినిమాలో నటి నిరూపా రాయ్.. అమితాబ్, శశికి తల్లిగా నటించింది. ఈ కథలో కొడుకులిద్దరూ తల్లి ఎవరితో ఉండాలన్న దానిపై గొడవపడుతుంటారు. అయితే ఈ కథనే స్వచ్ఛ భారత్ సారాంశంగా మారుస్తూ.. పోస్టర్‌పై ఓ డైలాగ్ రాశారు. ఓ పక్క తల్లి తనతోనే ఉండాలని అమితాబ్, కాదు తనతోనే ఉండాలని శశికపూర్ అంటుంటారు. కానీ నిరూపా మాత్రం ‘ఎవరైతే ముందు మరుగుదొడ్డి కట్టిస్తారో వారితోనే ఉంటాను’ అంటుంది. స్వచ్ఛభారత్ కార్యక్రమం గురించి అవగాహన కల్పించడం కోసం ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో ఈ పోస్టర్‌ను పెట్టారు. దీనిని సాహు అనే నెటిజన్ మోదీకి ట్వీట్ చేశాడు. దీనిని మోదీ రీట్వీట్ చేస్తూ.. ‘హా హా..
పరిశుభ్రత గురించి చెప్పడానికి సినిమా పోస్టర్‌ని వాడుకున్నారు. వినూత్నమైన ఆలోచన’ అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







