మరో బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టనున్న సూపర్ స్టార్ మహేష్

- April 12, 2017 , by Maagulf
మరో బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టనున్న సూపర్ స్టార్ మహేష్

అలనాటి నటీనటులకు ముంచు చూపు లేక చివరి స్టేజ్ లో ఆర్ధికంగా చాలా ఇబ్బందులకు గురయ్యారు అని చదువుతూనే ఉన్నాం.. కానీ ఇటీవల నటీనటులు కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే ముందు చూపుతో బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టి ఆర్ధిక భరోసాను ఏర్పాటు చేసుకొంటున్నారు. ఇప్పటికే రకుల్, తమన్నా, తాప్సీ, ప్రణీత వంటి వారు బిజినెస్ రంగంలో అడుగు పెట్టి సక్సెస్ అందుకొన్నారు.. ఇక నాగార్జున సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ అన్న సంగతి విధితమే.. ఇక యంగ్ హీరో రామ్ చరణ్ కూడా వివిధ బిజినెస్ ల్లో ఇన్వెస్ట్ చేసి సక్సెస్ అందుకొన్నాడు.. నితిన్, శర్వానంద్ వంటి వరుకూడా బిజినెస్ లోకి అడుగు పెట్టారు.. కాగా సూపర్ స్టార్ మహేష్ కూడా నటన తో పాటు నిర్మాతగా మారాడు.. నిర్మాతగా సక్సెస్ అందుకొన్న మహేష్ మరో కొత్త బిజినెస్ రంగంలోకి అడుగు పెడుతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు థియేటర్స్ బిజినెస్ లో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయినట్లు సమాచారం.. ఏషియన్ థియేటర్స్ కు చెందిన సునీల్ నారంగ్ తో కలిసి మహేష్ బాబు బిజినెస్ రంగంలోకి దిగనున్నట్లు ఈ మేరకు మహేష్ బాబు చర్చలు జరుపుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మొదటి దశలో తెలుగు రాష్ట్రాల్లో 25 థియేటర్స్ ఏర్పాటు చేయాలని మహేష్ బాబు ప్లాన్ చేస్తునట్లు టాక్ ..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com