ఒమన్‌ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీని సందర్శించిన 'నామా'

- April 12, 2017 , by Maagulf
ఒమన్‌ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీని సందర్శించిన 'నామా'

నామా గ్రూప్‌కి చెందిన హెల్త్‌, సేఫ్టీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ టీమ్‌, ఒమన్‌ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీని సందర్శించింది. వర్క్‌ ఫ్లో, అలాగే రెగ్యులేషన్స్‌ వంటివాటి గురించి తెలుసుకునేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కంపెనీ సీఈఓ పలు శాఖలకు చెందిన అధిపతులు ఈ టీమ్‌కి ఘనస్వాగతం పలికారు. మవాలెలోని కంపెనీ హెడ్‌ క్వార్టర్‌లో వీరికి ఘనస్వాగతం లభించింది. సుల్తాన్‌ కబూస్‌ ఎలక్ట్రిసిటీ స్టేషన్‌ వంటివాటిని కూడా సందర్శించారు ఈ సందర్భంగా. సుల్తాన్‌ కబూస్‌ ఎలక్ట్రిసిటీ స్టేషన్‌ - మదినాత్‌ ప్రాజెక్ట్‌ 10 మిలియన్‌ ఒమన్‌ రియాల్స్‌ ఖర్చుతో చేపట్టారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 132 కెవి ట్రాన్స్‌ఫార్మర్స్‌ని విస్తరించడం వంటివి ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com