మామిడిపళ్లపై చైనా విషం
- April 12, 2017
సీజన్ వచ్చింది కదా అని మామిడిపళ్లు లాగిస్తున్నారా.. కానీ మీరు తింటున్నదేంటో తెలిస్తే మాత్రం మీ వెన్నులో వణుకు ఖాయం. అవును మీరు తింటోంది భయంకరమైన విషం. కార్బైడ్ లేదుకదా అనుకోవచ్చు. కానీ ఆ స్థానాన్ని చైనా విషం ఎప్పుడో ఆక్రమించింది. ఇప్పటికే మామిడిపళ్ల ద్వారా నగరమంతా వ్యాపించింది. అవును సాక్షాత్తూ రాష్ట్రంలోనే అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ అయిన గడ్డి అన్నారం మార్కెట్ ను ఈ చైనా విషం ముంచెత్తింది. టన్నుల మామిడికాయలను రోజుల్లో పండ్లుగా మార్చేస్తోంది. గతంలో కార్బైడ్ మన ప్రాణాలతో చెలగాటం ఆడితే.. ఇప్పుడు ఆ స్థానంలో చైనా పౌడర్ ఎంట్రీ ఇచ్చింది. కాయలను మగ్గబెట్టేందుకు వ్యాపారులకు, దళారులకు కార్బైడ్ లేని లోటు తీరుస్తోంది. పండ్లు కొనేవారి ఆరోగ్యం హరించేస్తోంది. కొత్త కొత్త రోగాలు తెచ్చిపెట్టేందుకు సిద్ధమైంది. ఈ చైనా పౌడర్ గడ్డి అన్నారం మార్కెట్లో కూడా విచ్చలవిడిగా ఉపయోగిస్తుండడం కలకలం సృష్టిస్తోంది. ప్రభుత్వాలు కఠిన నిబంధనలను విధిస్తుంటే వ్యాపారులు సరికొత్త ఎత్తులు వేస్తున్నారు. కోర్టులు కార్బైడ్ వాడకంపై కఠినంగా వ్యవహరించేసరికి ఇప్పుడు దాని స్థానంలో చైనా పౌడర్ ఉపయోగిస్తున్నారు. ఈ చైనా పౌడర్ పేరు ఎథిలీన్ కంట్రోల్ రిలీజింగ్ ఏజెంట్. కాల్షియం కార్బైడ్ తేమతో కలిసి రిలీజ్ చేసే ఎథిలీన్ నే ఇది కూడా విడుదల చేస్తుంది. కార్బైడ్ కూ దీనికీ పెద్దగా తేడాలేదు. కానీ దీనిపై నిషేదం లేకపోవడంతో గడ్డి అన్నారం మార్కెట్లో దీన్ని విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. రోజుకు మార్కెట్ కు 500 నుంచి 600 టన్నుల మామిడికాయలు దిగుమతి అవుతున్నాయి. కానీ మార్కెట్లో ఉన్నది మాత్రం ఒకే ఒక ఎథిలీన్ చాంబర్. కాసుల కోసం కక్కుర్తి పడిన అధికారులు ఉన్న ఒక ఎథిలీన్ చాంబర్ నూ ఓ వ్యాపారికి లీజ్‌కు ఇచ్చేశారు. దీంతో అతడు దాన్ని కోల్డ్ స్టోరేజిగా మార్చేశారు. మామిడి పళ్లు భారీగా మార్కెట్ కు తరలివస్తున్నా.. వాటికి చాంబర్ ను ఇవ్వకుండా.. దాన్లో ఆపిల్స్, మిర్చి పెడుతున్నారు. చాంబర్లకు కరెంటు కోత కూడా తోడవుతుండడంతో.. బయట చైనా పౌడర్ తోనే కాయలు పండించడం బెటరని వ్యాపారులు డిసైడైపోయారు. ఎథిలీన్ చాంబర్లు లేకపోవడంతో తమకు నచ్చిన రేటుకు మామిడి కొనుగోలు చేస్తున్న కొందరు వ్యాపారులు వాటిని భారీ ధరకు అమ్ముకుంటున్నారు. కొందరు వీటిని నగర శివార్లలోని గోడౌన్లకు తరలించి అక్కడ వాటిని కార్బైడ్ వేసి మగ్గబెడుతున్నారు. మార్కెట్లో సరిపడా ఎథిలీన్ చాంబర్స్ లేకపోవడం అక్రమార్కులకు కలిసొచ్చింది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







