ఓరెడూ కస్టమ్స్‌కి 40 శాతం వరకు డిస్కౌంట్‌

- April 12, 2017 , by Maagulf
ఓరెడూ కస్టమ్స్‌కి 40 శాతం వరకు డిస్కౌంట్‌

కతర్: కొత్త ప్రమోషనల్‌ ఆఫర్‌లో భాగంగా ఓరెడూ తమ షాహ్రీ అన్‌లిమిటెడ్‌ ఇంటర్నెట్‌ ప్యాక్‌ కస్టమర్స్‌కి ఆకర్షణీయమైన డిస్కౌంట్‌ ప్రకటించింది. టోటల్‌ ఛార్జీలలో 40 శాతం వరకు డిస్కౌంట్స్‌ని అందిస్తున్నారు. కంపెనీ అందిస్తోన్న సూపర్‌ నెట్‌ సర్వీస్‌ వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఈ ఆఫర్‌ని పొందవచ్చునని సంస్థ ప్రతినిథులు తెలిపారు. నెట్‌గేర్‌ కేట్‌ 9 - 4జి డివైజ్‌ - ఖతారీ రియాల్స్‌ 999, నెట్‌ గేర్‌ క్యాట్‌ 6 మై వైఫై డివైజ్‌ 799 ఖతారీ రియాల్స్‌, హువై క్యాట్‌ 6 డివైజ్‌ 729 ఖతారీ రియాల్స్‌, క్ష్మీఉవై కార్‌ ఫై డివైజ్‌ 330 ఖతారీ రియాల్స్‌ తదితర ప్యాకేజీలు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా షాహ్రీ ఇంటర్నెట్‌ ప్యాక్‌ సబ్‌ స్క్రైబర్స్‌ 20 శాతం ఆఫర్‌ని సొంతం చేసుకోవచ్చు. జులై 1 వరకు ఈ ప్రమోషన్‌ అందుబాటులో ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com