షార్జాలో జోరందుకున్న 'గల్ఫీ' ప్రమోషన్
- April 13, 2017
గల్ఫ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా షార్జా లో ని ఇండస్ట్రియల్ ఏరియా 17 లో గల్ఫీ కాంటెస్ట్ నిర్వహించటం జరిగింది. షార్జా ఏరియా ప్రమోషనల్ అంబాసిడర్ రాజేష్ వేమూరి అక్కడి కాంపుల్లో ఉన్న తెలుగు వారితో సినిమా విశేషాలు పంచుకున్నారు. గల్ఫ్ లో కార్మికులు ఎదుర్కుంటున్న సమస్యలు ,వారు ఇక్కడికి రావటానికి ప్రేరేపించిన ఇండియాలో పరిస్థితుల మీద చర్చిస్తూ ఈ సినిమా రూపొందుతోంది. పి సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.గతంలో శ్రీ సునీల్ కుమార్ రెడ్డి పలు సామాజిక ఇతివృత్తాల ని కధాంశంగా చేసుకుని చిత్రాలని రూపొందించారు. మత్స్య కారుల పోరాటం మీద తీసిన గంగపుత్రులు సినిమా ఉత్తమ చిత్రంగా అవార్డులు గెలుచుకుంది. అలాగే తెలంగాణ నుండి వలస వచ్చిన గల్ఫ్ కార్మికుల వ్యధ ని ఇతివృత్తంగా చేసుకుని , మంచి ఆశయంతో రూపొందిన గల్ఫ్ సినిమా ని విజయవంతం చేయాలని ఇక్కడి తెలుగు వారికి రాజేష్ వేమూరి విజ్ఞప్తి చేశారు.


తాజా వార్తలు
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం
- ఏపీలో ఎయిర్పోర్ట్ అభివృద్ధి పై కేంద్రం శుభవార్త
- IPL మెగా ఆక్షన్: 2025లో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల పూర్తి జాబితా..
- వరల్డ్ కప్ విజేతలకు విశాఖలో స్వాగతం..
- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్లు వీరే!
- జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి
- మెడికవర్ హాస్పిటల్స్ లో 'న్యూరో స్టెంటింగ్' ద్వారా 69 ఏళ్ళ మహిళ కొత్త జీవితం
- చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
- బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!







