'మిస్టర్' మూవీ రివ్యూ

- April 14, 2017 , by Maagulf
'మిస్టర్' మూవీ రివ్యూ

రెండు ఫ్లాప్‌లతో కష్టాల్లోపడిన డైరెక్టర్ శ్రీనువైట్ల తెరకెక్కించిన లేటెస్ట్ ఫిల్మ్ మిస్టర్. శుక్రవారం తెలుగు రాష్ర్టా్లతోపాటు ఓవర్సీస్ లో భారీ ఎత్తున రిలీజైంది. నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ తేజ్, కమర్షియల్ హీరోగా ప్రూవ్ చేసుకోలేక పోతున్నాడు. మరి వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ఫిల్మ్ మిస్టర్. ఇటు ఇండస్ర్టీలోనూ అటు అభిమానుల్లోనూ ఒకటే ఆసక్తి. ఈ ఫిల్మ్‌తో ఓ మెట్టు పైకెక్కారా? రొటీన్ అనిపించుకున్నారా? అనేది తెలియాలంటే రివ్యూలోకి ఓసారి వెళ్లొద్దాం.
స్టోరీ.. 
స్పెయిన్‌లోవున్న బిజినెస్‌మేన్ కొడుకు చై(వరుణ్‌తేజ్‌).. ఇండియా నుంచి వచ్చిన ప్రియ అనే అమ్మాయిని రిసీవ్‌ చేసుకోవడానికి ఎయిర్‌పోర్టుకి వెళ్తాడు. ప్రియను కాకుండా మీరా(హెబ్బా)ను రిసీవ్‌ చేసుకుంటాడు. ఆ తర్వాత ఆమెతో చై లవ్‌లో పడతాడు. ఆమె మాత్రం సిద్ధార్థ్‌(ప్రిన్స్‌)ని లవ్ చేస్తుంది. వచ్చిన పని పూర్తికాగానే మీరా ఇండియాకి వెళ్లిపోతుంది.
ఓ రోజు చైకి ఫోన్‌ చేసి తన లవ్ విషయంలో సమస్యలు తలెత్తాయని చెబుతుంది. దీంతో మీరా సమస్యపై పరిష్కరించేందుకు స్పెయిన్ నుంచి ఇండియాకి వెళ్తాడు. ఇదే సమయంలో చైకి చంద్రముఖి(లావణ్య త్రిపాఠి) ఎదురవుతుంది. ఇంతకీ మీరా ఎవరు? చంద్రముఖి ఎవరు? చివరకు చై ఎవర్ని మ్యారేజ్ చేసుకున్నాడు? అన్నది తెరపై చూడాల్సిందే!
విశ్లేషణ.. 
వరసగా రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడడంతో, ఈసారి కాసింత కమర్షియల్ జోడించి తన మార్క్ స్టోరీతో మిస్టర్‌ని తెరకెక్కించాడు డైరెక్టర్ శ్రీనువైట్ల. ఎప్పటికప్పుడు కొత్త పాత్రలు తెరపై వస్తున్నా, స్టోరీలో అనుక్షణం మలుపులు. ఇవన్నీ ప్రేక్షకుడికి సినిమా చూస్తున్న ఫీల్‌ రాలేదు. స్టోరీ బలహీనంగా మారడంతో కామెడీ కూడా కలిసి రాలేకపోయింది. మొదట్లో విలేజ్ నేపథ్యం స్టోరీ, ఆ వెంటనే స్పెయిన్‌కి వెళ్లడం, అక్కడ సాంగ్స్ కాగానే మళ్లీ పల్లెటూరుకి సీన్ మారడం కాసింత కన్య్ఫూజన్‌లో పెట్టేశాడు. సింపుల్‌గా చెప్పాలంటే ఫస్టాఫ్.. సినిమా చూసినట్టుగా అనిపిస్తుంది. సెకండాఫ్ లవ్ కాన్సెప్ట్‌తో నడిపించినా, బలంగా ప్రేమ పండలేదు. బలవంతంగా భావోద్వేగాలు పండించే ప్రయత్నం చేశాడు. విదేశాల్లో కామెడీ, పేరడీ సీన్స్, నటీనటులపై పంచ్ డైలాగ్స్, గత సినిమా తరహాలో మాస్ ఎలిమెంట్స్ మిస్టర్‌లో కనిపించాయి. ఇక నటీనటుల యాక్టింగ్ విషయానికొస్తే.. వరుణ్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.
తనదైన కామెడీ టైమింగ్ తో మెప్పించే ప్రయత్నం చేశాడు. వరుణ్‌కి ఇదో కొత్త రకమైన స్టోరీ. లావణ్య త్రిపాఠి నటన బాగుంది.. రకరకాల ఎమోషన్స్ తో తన రోల్‌కి న్యాయంచేసింది. ఇక హెబ్బాపటేల్ అందంతో పాటు నటనతోనూ ఓకే అనిపించింది. విలన్ పాత్రలో నికితిన్.. డీసెంట్ లుక్స్ లో కనిపిస్తూనే క్రూయల్ విలన్ గా బెటరనిపించాడు. ఇతర క్యారెక్టర్లలో నాజర్, తనికెళ్ల భరణి, చంద్రమోహన్, హరీష్ ఉత్తమన్, రాజేష్, 30 ఇయర్స్ పృధ్వీ వంటి నటులు పర్వాలేదనిపించారు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్‌కి మంచి మార్కులు పడ్డాయి. గుహన్ సినిమాటోగ్రఫి సినిమాకు ప్లస్ పాయింట్. స్పెయిన్ లొకేషన్స్‌ను అందంగా చూపించాడు. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. నటీనటుల యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు ప్లస్ పాయింట్ కాగా, లెక్కలేనన్ని మలుపులు, స్టోరీలో కొత్తదనం లేకపోవడం, సాగతీత సన్నివేశాలు ప్రేక్షకుడ్ని ఇబ్బందిపెట్టాయి. 
మొత్తమ్మీద ఈ సమ్మర్లో మిస్టర్ పర్ఫెక్ట్ కాలేకపోయాడనేది సగటు ప్రేక్షకుడి మాట. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com