సెన్సార్ తీర్పు : బాబు పెద్దలకు మాత్రమే- 'బాబు బాగా బిజీ'

- April 15, 2017 , by Maagulf
సెన్సార్ తీర్పు : బాబు పెద్దలకు మాత్రమే- 'బాబు బాగా బిజీ'

అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'బాబు బాగా బిజీ'. నవీన్ మేడారం దర్శకుడు. చిన్న వయసు నుండే సెక్స్‌ని అమితంగా ఇష్టపడే ఓ కుర్రాడు, వయసుతో సంబంధం లేకుండా సెక్స్‌లో పాల్గొంటూ, సెక్స్‌ కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టే పాత్రలో అవసరాల శ్రీనివాస్‌ నటించనున్నాడు. ఇటీవలే రిలీజైన ఈ చిత్ర టీజర్ అదరగొట్టింది. ఏకంగా 4మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకొంది.
ఈ చిత్రాన్ని మే5న రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా, ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకొంది. సెన్సార్ బోర్డ్ బాబుకి 'ఎ' సర్టిఫికెట్ ని జారీ చేసింది. అడల్ట్ కంటెంట్ ఎక్కువుగా ఉండటంతో ఈ మూవీకి పెద్దలకు మాత్రమేనని సెన్సార్ బోర్డ్ తీర్పునిచ్చింది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com