ఎయిరిండియా ఎయిర్లైన్స్ వారి ప్రత్యేక ఆఫర్‌

- April 15, 2017 , by Maagulf
ఎయిరిండియా ఎయిర్లైన్స్ వారి ప్రత్యేక ఆఫర్‌

ముంబయి: ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియా డిస్కౌంటెడ్‌ స్టార్‌ అవార్డ్‌ మైలేజ్‌ రెడిమ్‌ప్షన్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఇది అమెరికాలో ప్రయాణించే వారికి మాత్రమే వర్తిస్తుంది. గురువారం ప్రారంభమైన ఈ ఆఫర్‌ ఏప్రిల్‌ 18 వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌ కింద ప్రయాణ కాలపరిమితి మాత్రం తర్వాతి 330 రోజులకు వరకు ఉంటుందని తెలిపింది. అమెరికాలో ప్రయాణించే వారు ఫ్లైయింగ్‌ రిటర్న్‌ పాయింట్స్‌ను రెడిమ్‌ చేసుకొని ప్రతి ప్రయాణానికి 60శాతం డిస్కౌంట్‌ పొందొచ్చని తెలిపింది. ఇది 2,500 మైళ్ల దూరానికి వర్తిస్తుంది. రద్దయ్యే పాయింట్లను పునరుద్ధరించే పథకం గడువును వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com