మోహన్‌లాల్ హీరోగా గిన్నిస్ అందుకున్న 'మన్యంపులి'
- April 15, 2017
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటించిన చిత్రం 'పులి మురుగన్'. కేవలం పాతికకోట్లతో దర్శకుడు వైశాఖ్ తెరకెక్కించిన ఈ చిత్రం గతేడాది సూపర్‌డూపర్ హిట్ అయింది. ఇంతకీ విషయమేంటంటే.. ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ఓ అరుదైన రికార్డ్ సాధించింది. ఇటీవలే ఈ మూవీ త్రీడీ వెర్షన్‌ని కేరళలోని తిరువనంతపురంలో ఉండే అడ్లక్స్ థియోటర్లో దాదాపు 20 వేల మంది వీక్షించారు. ఇలా ఏకంగా ఒకేసారి 20వేల మంది త్రీడీ చిత్రాన్ని వీక్షించటం ప్రపంచంలో ఇదే తొలిసారి. దీంతో గిన్నిస్ రికార్డ్ వరించింది. 2012 సంవత్సరంలో హాలీవుడ్ చిత్రం 'మెన్ ఇన్ బ్లాక్'ను ఆరువేల మంది ప్రేక్షకులు త్రీడీలో వీక్షించారు. ప్రస్తుతం ఆ రికార్డును 'పులి మురుగన్' ఊహించని స్థాయిలో వెనక్కి నెట్టేసింది. బాక్సాఫీస్ దగ్గరే కాదు రికార్డుల్లోనూ మలయాళ పులి గర్జించిందనమాట!
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









