మే 25, 26 తేదీల్లో ఇండియన్ స్కూల్ ఫెయిర్
- April 16, 2017
గత ఏడాది నిర్వహించిన ఇండియన్ స్కూల్ మెగా ఫెయిర్‌లో సుమారు 800 మంది విద్యార్థులకు ఫీజు రాయితీ లభించిందని ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ (ఐఎస్బి) ఛైర్మన్ ఎస్ నటరాజన్ చెప్పారు. ఇసా టౌన్ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఈ వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది నిర్వహించే మెగా ఫెయిర్ వివరాల్ని ప్రకటించారు. ఈ ఏడాది నిర్వహించే మెగా ఫెయిర్, విద్యార్థులకు, సిబ్బందికి మరింతగా ఉపయోగపడ్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ ఏడాది మే 25, 26 తేదీల్లో మెగా ఫెయిర్‌ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఫుడ్ ఫెస్టివల్, ఎలక్ట్రానిక్స్ ఎక్స్పో, స్టూడెంట్స్‌తో గ్రాండ్ ఎగ్జిబిషన్ వంటివి నిర్వహిస్తారు. ఎంట్రీ ఫీజుని ఒక్కొక్కరికి 2 బహ్రెయినీ దినార్స్‌గా నిర్ణయించారు. ఈ ఫెస్టివల్ ద్వారా జనరేట్ అయ్యే నిధుల్ని, స్కల్ అభివృద్ధికి, వెల్ఫేర్ యాక్టివిటీస్‌కి వినియోగిస్తామని తెలిపారు నటరాజన్. తమ స్కూల్ మాత్రమే లోయెస్ట్ ఫీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి ఉందనీ, స్పాన్సరర్స్, కమ్యూనిటీ మెంబర్స్ సహకారంతో విజయవంతంగా స్కూల్ నడుస్తోందని చెప్పారాయన. ఈసారి నిర్వహించే మెగా ఫెయిర్ సూపర్ సక్సెస్ అవుతుందని, ఫెయిర్‌కి వచ్చేవారి భద్రత కోసం అనేక చర్యలు తీసుకుంటామని వివరించారు నటరాజన్.
తాజా వార్తలు
- భారత్ నుంచి బహ్రెయిన్‌కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్‌లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్‌కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..







