దుబాయిలో ఏప్రిల్ 15 న జరిగిన మూగ చెవుడు మందబుద్ధిపై అవగాహన ఉత్సవం

- April 18, 2017 , by Maagulf

 దుబాయ్:మూగతనం చెవుడు మందబుద్ధిపై పై అంతర్జాతీయ అవగాహన కార్యక్రమం గుర్తు చేసుకొంటూ ఏప్రిల్ 15 వ తేదీన ఘనంగా జరిగింది.  గత శనివారం సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దుబాయ్ లోని జాబీల పార్క్ వద్ద ఈ వేడుక నిర్వహించబడింది. వినుత్నమైన చర్చలు మరియు కార్యకలాపాలతో పాటు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఎ ఎస్ డి) అవగాహన పెంచడం కొరకు మూడు కిలోమీటర్ల నడకలో పలువురు అతిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే ఈ వ్యాధిబారిన పడిన పిల్లలు,పెద్దలతో ఒకరితో ఒకరు కలిసి సంతోషంగా గడిపేరు. ఉచితంగా ప్రవేశించే ఈ ఉత్సవంలో నేరుగా వినేందుకు సంగీతం దుబాయ్ పోలీస్ బ్యాండ్, కళలు, చేతితో తయారుచేయబడిన వివిధ కళాకృతులు, పిల్లల కొరకు ఆటలు  సంగీతం, ప్రదర్శనలు, పిల్లలకు కళలు, చేతిపనులు, లాటరీలో బహుమతులు మరియు తినేందుకు పుష్కలంగా ఆహారం ఇక్కడ లభించింది..ఈ కార్యక్రమాన్ని దుబాయ్ ఆధారిత బాలల ఎర్లీ ఇంటర్వెన్షన్ మెడికల్ సెంటర్, యూఏఈ  రెడ్ క్రెసెంట్, దుబాయ్ మున్సిపాలిటీ, దుబాయ్ హెల్త్ కేర్ సిటీ సహకారంతో, కామెలిసివ్స్ టైటిల్ ప్రాయోజితులుగా నిర్వహించబడింది. పలు పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సెన్సెస్ సెంటర్ నుండి ప్రత్యేక అవసరాలు కల్గిన 25 మంది మూగ  చెవుడు మందబుద్ధి గల విద్యార్థులు సైతం వారి సహాయకుల సహకారంతో హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com